మనలో చాలామంది పులిచింత ఆకుల గురించి ఏదో ఒక సందర్భంలో వినే ఉంటారు. పులిచింత ఆకుల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. పులిచింత ఆకులు మూత్ర నాళాల రుగ్మతలకు చికిత్స చేయడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. శ్వాస సమస్యలను తొలగించడంతో పాటు నిద్రలేమి సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. నిద్రలేమికి మేలు చేయడంతో పాటు కండరాల బలాన్ని మెరుగుపరుస్తాయి.
పులిచింత ఆకుల వల్ల పులిపిర్లు రాలిపోతాయి. కదిలే దంతాలు గట్టిపడేలా చేయడంలో పులిచింత ఆకులు ప్రయోజనకరంగా ఉంటాయి. పులి చింత ఆకు రసంతో కాస్తంత సైంధవ లవణం కలిపి పూస్తే పులిపిర్లు సులువుగా రాలిపోతాయని చెప్పవచ్చు. పులి చింత వేళ్లను నీటిలో వేసి కాచి, ఆ కషాయంతో 10 నిమిషాల పాటు పుక్కిలిస్తే కదిలే దంతాలు సులువుగా గట్టి పడే ఛాన్స్ అయితే ఉంటుంది.
ప్రకృతిలో లభించే ప్రతి మొక్కలోనూ ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉండగా పులి చింత ఆకు ప్రయోజనాలు ఎక్కువమందికి తెలియదు. వర్షాకాలంలో ఈ మొక్క విరివిగా పెరిగే అవకాశాలు ఉంటాయి. మన ఇంట్లో పెంచుకుంటున్న పూల కుండీల్లోనూ ఈ మొక్క పెరిగి నిండుగా పాకుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ఈ తీగ జాతి మొక్క ఆకులు నమిలి తింటే పుల్లగా ఉంటాయి.
పులి చింత ఆకులను తినటం వలన ముక్కు, గొంతు, మలం ద్వారా పడే రక్తాన్ని నివారిస్తుందని చెప్పవచ్చు. ఈ ఆకులను ముద్దగా నూరి రసాన్ని ఫైల్స్ ఉన్నచోట రాసుకుంటే అవి త్వరగా రాలిపోతాయి. పులి చింత ఆకులను పప్పుగా వండుకొని తింటే కూడా ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.