బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నేటి ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా మారింది.నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగింది అనే విషయానికి వస్తే పరంధామయ్యకు అజీర్తి చేయడంతో అంకిత వెళ్లి ఫ్రిజ్ తీయడానికి చూడగా తాళాలు వేసి ఉంటుంది.ఎన్ని రోజుల నుంచి ఇలా జరుగుతుంది అంటూ లాస్యతో గొడవపడి ఫ్రిడ్జ్ తాళాలు ఇవ్వమని అడుగుతుంది.లాస్య మాత్రం ఇవ్వనని చెబుతుంది ప్రిజ్ తాళాలు వేయడానికి నువ్వెవరు అంటే ఎన్ని రోజులు నీకు తెలియదా ఇది నా ఇల్లు ఇంటికి నేను యజమానురాలిని మీ ఇష్టానుసారం మీరు ఖర్చు చేసుకుంటూ పోతే ఇంటి బాధ్యత ఎవరు చూసుకుంటారు అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది.
దీంతో శృతి అక్కడికి వెళ్లడంతో మొన్నటి నుంచి చూస్తున్న ఇది నా ఇల్లు నా ఇల్లు అని రెచ్చిపోతున్నావు ఈ ఇల్లు నువ్వు మోసం చేసి రాయించుకున్నావు అని శృతి అనడంతో లాస్య ఇంకొక్కసారి అలా అంటే మర్యాద ఉండదు అని వార్నింగ్ ఇస్తుంది. ఒక్కసారి కాదు వంద సార్లు అంటాను అని శృతి మాట్లాడుతుంది.ఎవరు లేనటువంటి అనాధవు నువ్వు ఇలా మాట్లాడతావా అంటూ లాస్య అనడంతో నేను కాదు అనాధవి నువ్వు అని శృతి లాస్యకు గట్టిగా కౌంటర్ ఇస్తుంది. షట్ అప్ అని లాస్య అనడంతో యు షేటప్ అంటూ శృతి ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది.
శృతి కళ్ళు తిరిగి పడిపోయే సరికి అంకిత అనసూయ పరంధామయ్య కంగారుపడుతూ తనని లోపలికి తీసుకువెళ్తారు. మరోవైపు తులసి పూజ చేస్తూ ఉండగా పూజ ప్లేట్ కింద పడిపోవడంతో ఎందుకు స్వామి ఇలా చేశావు ఏం జరగబోతుంది అంటూ బాధపడుతూ కూర్చుంటుంది. మరోవైపు అంకిత శృతికి చెకప్ చేస్తూ అందరిని కాస్త టెన్షన్ పెట్టినప్పటికీ చివరికి తాను తల్లి కాబోతుందని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ సంతోషపడతారు.ఇక శృతి ఇదే విషయాన్ని తులసికి ఫోన్ చేసి మీరు నాన్నమ్మ కాబోతున్నారు అని చెప్పడంతో తులసి సంతోషానికి అవధులు ఉండవు.
శృతి ఈ విషయం చెప్పగానే ఎన్నో రోజుల నుంచి తాను ఈ విషయం వినడానికి ఎదురు చూస్తున్నాను అంటూ వెంటనే చీర పసుపు కుంకుమ పువ్వులు గాజులు తీసుకొని శృతి వద్దకు పరుగులు పెడుతుంది. శృతి వద్దకు వెళ్లగానే లాస్య తులసిని అడ్డుకుంటుంది.త్వరగా వెళ్లి వేడుక చేయాలి ఇప్పటికే పసుపు కుంకుమ చీర అన్ని తీసుకువచ్చాను అంటూ తులసి మాట్లాడటంతో ఇక్కడ ప్రెగ్నెట్ ఎవరూ లేరు అని లాస్య మాట్లాడుతుంది. అదేంటి నేను నాన్నమ్మను కాబోతున్నానను అని తులసి చెప్పడంతో లాస్యకు ఏమి అర్థం కాదు చివరికి శృతి ప్రెగ్నెంట్ అని తెలుసుకోవడంతో వెటకారంగా కంగ్రాచ్యులేషన్స్ చెబుతుంది. అలాగే ఇంటి కోడలుగా తనకు వేడుక చేయడానికి నేనే అర్హురాలు నువ్వు కాదు అంటూ తులసి వేడుక చేయటాన్ని లాస్య అడ్డుకుంటుంది శృతి మాత్రం తనకు లాస్య ఆంటీ చేతుల మీదుగానే వేడుక జరగాలని పట్టుబడుతుంది.