ఈ పంట పండిస్తే సులువుగా లక్షల్లో లాభం పొందే ఛాన్స్.. ఎలా అంటే?

ఈ మధ్య కాలంలో చాలామంది రైతులు చిన్నచిన్న పొరపాట్ల వల్ల భారీ మొత్తంలో నష్టపోతున్నారు. ఎప్పుడూ వేసే పంటలు వేయడం వాటికి మార్కెట్ లో సరైన ధర లేకపోవడం వల్ల రైతులు నష్టపోవడం జరుగుతుంది. అయితే తులసి పంటను సాగు చేయడం ద్వారా రైతులు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఔషధ మొక్కలలో ఒకటైన తులసికి ఊహించని స్థాయిలో డిమాండ్ ఉంది.

తక్కువ స్థలంలోనే ఎక్కువ పంటలు పండించాలని భావించే వాళ్లకు ఔషధ మొక్కలు పండించడం బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని తులసి పంటను పండిస్తే మాత్రం కళ్లు చెదిరే స్థాయిలో లాభాలు గ్యారంటీ అని చెప్పవచ్చు. కొన్ని కంపెనీలు ఔషధ మొక్కలను సైతం పంపిణీ చేస్తుండటం గమనార్హం. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందాలని భావించే వాళ్లకు ఈ పంట సాగు బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

తులసితో పాటు ఇతర ఔషధ మొక్కల సాగు ద్వారా ఈ లాభాలు సొంతమవుతాయి. అయితే మార్కెటింగ్, ఇతర విషయాల గురించి పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉంటే మాత్రమే ఈ పంటలను సాగు చేయవచ్చు. ఈ పంటల సాగు గురించి కంపెనీలు సైతం ప్రజలకు అవగాహన కల్పిస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

తులసి సహాయంతో ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు సైతం సులువుగా చెక్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఔషధ మొక్కల సాగు తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను అందిస్తుంది. ఈ పంటలు సూటయ్యే భూములలో మాత్రమే వీటిని సాగు చేస్తే మంచి లాభాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.