తులసి మొక్క పక్కన ఈ మొక్కలు నాటితే.. అశుభం ఇంట్లో దారుణాలు జరుగుతాయంట..!

సనాతన ధర్మంలో తులసి మొక్కకు చాలా ఉన్నత స్థానం ఉంది. దీనిని కేవలం ఒక హరితగానే కాకుండా, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అవతారంగా భావిస్తారు. తులసిని ఇంట్లో పెంచడం వల్ల సౌభాగ్యం, శుభం, ఆరోగ్యం, సంతోషం పెరుగుతాయని నమ్మకం. అయితే తులసి మొక్కను పెంచేటప్పుడు కొన్ని వాస్తు నిబంధనలు తప్పకుండా పాటించాలి. ఎందుకంటే, తులసి పక్కన కొన్ని మొక్కలను ఉంచడం వల్ల శుభం కంటే అశుభ ఫలితాలు ఎదురవుతాయని పండితులు చెబుతున్నారు.

తులసికి పక్కన ఈ మొక్కలు అస్సలు ఉంచకూడదు:
జమ్మి చెట్టు: జమ్మి మొక్క ఇది పవిత్ర మొక్కే అయినా, తులసి చెట్టుకి దగ్గరగా నాటకూడదు. తులసి విష్ణువుకు ప్రీతికరం అయితే, జమ్మి చెట్టు శనితో సంబంధం కలిగి ఉంటుంది. ఈ రెండు చెట్లు ఒకే చోట ఉంటే ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. అందుకే జమ్మి మొక్కకి కనీసం 10-15 అడుగుల దూరం ఉండాలి.

ముళ్ళున్న మొక్కలు: గులాబీ, కలబంద వంటి ముళ్ళు గల మొక్కలు తులసి చెట్టు చుట్టూ పెట్టడం అనర్ధాలకు దారితీస్తుంది. వీటివల్ల కేతు గ్రహ ప్రభావం పెరిగి, కుటుంబంలో తలనొప్పులు, మనస్పర్థలు, ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి.

పాలు వచ్చే మొక్కలు (లాక్టిక్స్): జిల్లేడు లాంటి మొక్కల నుంచి పాలు లాంటి ద్రవం విడుదల అవుతుంది. ఇవి ప్రతికూల శక్తిని పెంచే లక్షణాలు కలిగి ఉంటాయి. తులసి చెట్టు దగ్గర ఈ మొక్కలు ఉంటే కుటుంబంలో శాంతి, సామరస్యానికి భంగం కలిగే అవకాశం ఉంది.

తులసి చెట్టును ఉంచడానికి సరైన దిశ, స్థానం: తులసి మొక్కను ఉత్తరం లేదా తూర్పు దిశల్లో ఉంచడం శ్రేష్టం. ముఖ్యంగా ఈశాన్య దిశలో ఉంచితే శుభ ఫలితాలు అనుభ వించవచ్చు. తులసిని ఎప్పుడూ వెలుతురు, గాలి బాగా వచ్చే ప్రదేశంలో ఉంచాలి. నేలపై నేరుగా పెట్టకూడదు. శుభ్రతతో కూడిన గడ్డి గంపలో లేదా తులసి కోటలో పెంచాలి. చీకటి ప్రదేశాల్లో తులసిని ఉంచడం వల్ల దుష్ఫలితాలు చవిచూడవలసి వస్తుంది. ఇంట్లో తులసి మొక్కను ప్రేమతో, శ్రద్ధతో పెంచడం ఒక ఆధ్యాత్మిక ఆచారమే కాదు, అది ఇంట్లో శుభవాతావరణాన్ని తీసుకొచ్చే శక్తివంతమైన సాధనంలా మారుతుంది. కానీ, దానికి అడ్డంగా ఉండే కొన్ని చిన్న తప్పులు కుటుంబానికి పెద్ద సమస్యలుగా మారవచ్చు. కనుక తులసి చెట్టు చుట్టూ ఉన్న వాస్తు నిబంధనలను పాటించడం ఎంతో అవసరం.