ఇవి తీసుకుంటే గుండె సమస్యలకు సులువుగా చెక్ పెట్టవచ్చట.. ఏం చేయాలంటే?

11_07_2022-heart-attack-symptoms_22881533 (1)

మనలో చాలామందిని ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా గుండె సంబంధిత సమస్యలు వేధిస్తున్నాయి. గుండె సంబంధిత సమస్యల బారిన పడితే కొన్ని సందర్భాల్లో ప్రాణాలకు అపాయం కలిగే అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి గుండె సంబంధిత సమస్యల బారిన పడితే జీవితాంతం ఇబ్బందులు పడక తప్పదు. అయితే కొన్ని మూలికలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు దూరమయ్యే ఛాన్స్ ఉంటుంది.

తులసి, అశ్వగంధ, బ్రాహ్మీ తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలు దూరమయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పసుపును ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరే అవకాశం అయితే ఉంటుంది. అవిసె గింజలు ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా కూడా సులభంగా హెల్త్ బెనిఫిట్స్ ను పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

బీపీ, గుండె జబ్బుల సమస్యలకు చెక్ పెట్టే విషయంలో అవిసె గింజలు తోడ్పడతాయి. ఆయుర్వేద మూలికలలో మొరింగ ఒకటి కాగా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టే విషయంలో మునగ చెట్టు ఉపయోగపడుతుంది. ముగనలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల వల్ల ఆరోగ్యానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరుతుంది. ఆమ్లా మూలికను ఆహారంలో భాగం చేయడం వల్ల డయాబెటిస్, లివర్, గుండె జబ్బులు, గ్యాస్టిక్ సమస్యలు దూరమవుతాయి.

రక్తంలోని కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించడంలో ఆమ్లా ఉపయోగపడుతుంది. అర్జున చెట్టు బెరడును తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ మూలికలను ఆహారంలో భాగం చేసుకోవడం లేదా ఇతర విధానాల ద్వారా తీసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు.