బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్న గుప్పెడంత మనసుసీరియల్ మరింత ఆసక్తికరంగా మారింది. ఇక నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయానికి వస్తే తన తల్లిదండ్రులు ఇద్దరు ఇంటికి వచ్చారన్న ఆనందంలో వసుధారతో కలిసి సరదాగా రిషి లాంగ్ డ్రైవ్ వెళ్లారు.ఇలా ప్రయాణిస్తూనే ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఒకచోట కారు ఆపి ఇద్దరు కూడా ప్రేమ కబుర్లు చెబుతూ ఉంటారు. ఇలా ఇద్దరు ఏకాంతంగా సరదాగా కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో నలుగురు ఆకతాయిలు వచ్చి కామెంట్స్ చేస్తారు.
ఇలా వారికి రీషికి మధ్య చిన్నపాటి గొడవ జరుగుతుంది. అనంతరం వారి చేతిలో ఉన్న ఆల్కహాల్ రిషి షర్టు పై పడటంతో ఇలా కనుక వెళితే పెద్దమ్మ నన్ను చూసింది అంటే ఇంకేమైనా ఉందా అంటూ గౌతమ్ ఇంటికి వెళ్లి షర్ట్ మార్చుకొని వెళ్లాలని అనుకుంటాడు. మరోవైపు దేవయాని బయటకు వెళ్ళిపోయిందనుకున్న జగతి తిరిగి వచ్చిందనీ ఆలోచిస్తూ జగతి గది వద్దకు రాగా అక్కడ వసుధారకు బదులు ధరణి ఉంటుంది. బయటకు వెళ్లి చూడగా కారు ఉండదు అలాగే గేట్లు కూడా తెరిచి ఉంటాయి. దీంతో వసుధార రిషి ఇద్దరు బయటకు వెళ్లారని మండిపడుతుంది.
రిషి మంచి వాడే కానీ వసుధార తనని చెడు కొడుతుంది త్వరలోనే వసుధార సంగతి చెబుతా అంటూ కోపం తెచ్చుకుంటుంది.మరోవైపు రిషి గౌతమ్ ఇంటికి వెళ్ళగా గౌతమ్ షాక్ అవుతారు. కొంపదీసి వీడికి నిజం కనుక తెలిసిపోయిందా అంటూ ఆందోళన చెందుతాడు. షర్ట్ మార్చుకోవడానికి వచ్చానని చెప్పగా హమ్మయ్య అనుకుంటాడు. గది లోపలికి వెళ్లి షర్టు మార్చుకుంటూ ఉండగా అక్కడ తన డాడ్ కు రిషి గిఫ్ట్ గా ఇచ్చిన వాచ్ కనబడుతుంది. బహుశా డాడ్ గౌతమ్ కి గిఫ్ట్ గా ఇచ్చాడేమోనని అనుకొని బయటకు వెళ్తాడు.
బయటకు వెళ్ళగానే గౌతమ్ ఈ షర్ట్ బాగాలేదు వేరేది వేసుకోవచ్చు కదా అని చెప్పగా రిషి మరోసారి లోపలికి వెళ్తాడు.అయితే అక్కడ తను తన డాడ్ కలిసి దిగిన ఫోటో అలాగే తన డాడ్ వాడే పర్ఫ్యూమ్ ఇతర వస్తువులను చూసి ఇన్ని రోజులు డాడ్ వాళ్ళు ఇక్కడే ఉన్నారని నిజం తెలుసుకొని బయటకు వచ్చి గౌతమ్ ను నిలదీస్తాడు.నమ్మకద్రోహి మిత్ర ద్రోహి ఇన్ని రోజులు డాడ్ వాళ్ళని ఇక్కడే పెట్టుకొని తమాషా చూసావా.
నేను డాడ్ వాళ్ళు కనిపించలేదని ఎంత బాధ పడ్డానో నీకు తెలుసు అయినా ఇదంతా చూస్తూ కనీసం ఇక్కడే ఉన్నారనే విషయాన్ని కూడా తనకు చెప్పలేదు అంటూ రిషి గౌతమ్ ను మాట్లాడినవ్వకుండా తనని తిడుతూ ఉంటారు. ఇలా అసలు నిజం తెలుసుకోవడంతో గౌతమ్ ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోతాడు. ఇంతటితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.