Bigg Boss 8: బిగ్ బాస్ 8 ఫినాలే చీఫ్ గెస్ట్ గా ఐ కాన్ స్టార్.. బన్నీ చేతుల మీదుగా విన్నర్ కు ట్రోఫీ!

Bigg Boss 8: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కార్యక్రమం మరొక మూడు రోజులు మాత్రమే ఉంది మూడు రోజులలో ఈ కార్యక్రమం గ్రాండ్ ఫినాలే ఎంతో ఘనంగా జరగబోతుంది. ఇక ఈ గ్రాండ్ ఫినాలే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాబోతున్నట్టు సమాచారం. ఇక 15వ వారంలో భాగంగా హౌస్ లో ప్రేరణ, అవినాష్, గౌతమ్, నిఖిల్, నబీల్ ఉన్న విషయం మనకు తెలిసిందే.

అయితే ఈ ఐదుగురిలో విన్నర్ ఎవరు అనే విషయంపై ఆసక్తి నెలకొంది ఒకవైపు గౌతమ్ అలాగే నిఖిల్ ట్రోఫీ కోసం పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. ఈ తరుణంలో బిగ్ బాస్ 8 కప్పు ఎవరికి వరిస్తుంది అనే విషయంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఇక ఈ కార్యక్రమం గ్రాండ్ ఫినాలే లో భాగంగా పలువురు సినీ సెలెబ్రిటీలు సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ వేదికపై సందడి చేయబోతున్నట్టు సమాచారం.

ఇప్పటికే ఎంతోమంది బుల్లితెర నటీనటులు బిగ్ బాస్ హౌస్ లోకి వెళుతూ కంటెస్టెంట్లను అలాగే ప్రేక్షకులను కూడా ఎంటర్టైన్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే గ్రాండ్ ఫినాలే రోజు పెద్ద ఎత్తున సెలెబ్రిటీలు ఈ వేదికపై సందడి చేయబోతున్నట్టు సమాచారం. ఇక పుష్ప సినిమా ప్రమోషన్లలో భాగంగా కూడా అల్లు అర్జున్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాబోతున్నట్టు సమాచారం.

ఇక ఈ గ్రాండ్ ఫినాలే లో భాగంగా అల్లు అర్జున్ చేతుల మీద గానే విజేతకు ట్రోఫీ అందించబోతున్నారని తెలుస్తోంది. పుష్ప 2 ది రూల్ మూవీ బాక్సాఫీస్ వద్ద వరల్డ్‌ వైడ్‌గా వైల్డ్ ఫైర్ క్రియేట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో పుష్ప రాజ్ వైల్డ్ ఫైర్‌తో బిగ్ బాస్ 8 తెలుగు సీజన్‌కు ముగింపు పలకనున్నారని సమాచారం. మరి అల్లు అర్జున్ గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియదు కానీ ఈ వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి.