విన్నర్ కి ప్రైజ్ మనీ తో పాటు మరో బంపర్ ఆఫర్.. ఎవరో ఆ అదృష్టవంతుడు!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 చివరి అంకానికి చేరుకుంది. 13వ వారం ఎలిమినేషన్ ఎవరూ ఊహించని విధంగా జరిగింది. 13వ వారం డబల్ ఎలిమినేషన్ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా శనివారం టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడు. ఆదివారం నాడు ఊహించని విధంగా పృథ్వీరాజ్ శెట్టి నీ ఎలిమినేట్ చేసి హౌస్ నుంచి బయటికి పంపించేశారు.

ఇక హౌస్ లో నిఖిల్, గౌతమ్, నబిల్, ప్రేరణ, అవినాష్, రోహిణి, విష్ణు ప్రియ ఈ ఏడుగురు మాత్రమే మిగిలారు. ఈ ఏడుగురిలో ఐదుగురు మాత్రమే ఫైనలిస్ట్ గా టైటిల్ కోసం పోటీ పడబోతున్నారు. కాబట్టి 14వ వారం నామినేషన్స్ లో చాలా ట్విస్టులు ఉంటాయి. ఇప్పటికే టికెట్ టు ఫినాలే గెలిచి నేరుగా ఫైనల్స్ లోకి అడుగుపెట్టేసాడు ముక్కు అవినాష్ కాబట్టి ఈ వారంలో అతనికి నామినేషన్స్ నుంచి మినహాయింపు వచ్చింది ఇక రోహిణి ఫస్ట్ టైం నామినేషన్ లోకి రావడం విశేషం.

పృద్వి ఎలిమినేషన్ తో విష్ణుప్రియ టాప్ ఫైవ్ రేసులోకి వచ్చేసింది. అయితే తాను ఓడిపోయినందుకు ఎలాంటి బాధ లేదు అని చెప్పుకొచ్చాడు పృద్వి. నిఖిల్, నబీల్,విష్ణుప్రియ సూపర్ గా ఆడుతున్నారని, రోహిణి, అవినాష్ లో బాగా ఆడటం లేదని చెప్పాడు పృద్వి. ఆ తర్వాత విన్న‌ర్‌కు ప్రైజ్‌మ‌నీ, ట్రోఫీతో పాటు మారుతి సుజుకీ ఆల్ న్యూ డ్యాజిలింగ్ డిజైర్ కారును కూడా సొంతం చేసుకుంటార‌ని ప్ర‌క‌టించారునాగార్జున. ఇక గోల్డెన్ టికెట్ వ‌చ్చిన ముగ్గురు కంటెస్టెంట్‌ల‌కు స్పెష‌ల్ ఆఫ‌ర్ ఉంటుంద‌ని చెప్పాడు.

ఈ కారుని గెలుచుకునే అదృష్టం ఎవరిని వరిస్తుందో చూడాలి. నిఖిల్, గౌతమ్, నవీన్,ప్రేరణ, విష్ణు ప్రియ, రోహిణి ఈ ఆరుగురు నామినేషన్స్ లోకి వచ్చారు అవినాష్ ఎలాగో ఫైనల్ గా అడుగుపెట్టేసాడు కాబట్టి ఇక మిగిలింది ఆరుగురు కంటెస్టెంట్లు అందులో రోహిణి ఫస్ట్ టైం నామినేషన్ లోకి రావడం విశేషం. పృద్వి ఎలిమినేషన్తో విష్ణుప్రియ టాప్ ఫైవ్ రేసులోకి వచ్చేసింది. చూడాలి మరి ఫైనల్ కి ఎవరు చేరుకుంటారో.