బిగ్‌బాస్ ` 7 ఉల్టా పుల్టా సీజన్లో ఐదోవారం ఎలిమినేషన్ పూర్తయింది. ఆదివారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. గౌతమ్, శుభశ్రీ రాయగురు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. అయితే తాను ఎలిమినేట్ కావడానికి అమర్‌దీప్ కారణమని, అతనొక మోసగాడని శుభశ్రీ చెప్పింది.
హౌస్ నుంచి బయటకు వచ్చిన ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘‘హౌస్‌లో చాలారోజులు ఉంటాననే నమ్మకంగా ఉన్నా. ఇంత త్వరగా ఎలిమినేట్ అవుతానని అనుకోలేదు. గత రెండు వారాలుగా బాగా ఆడాను. అందరితోనూ ఫ్రెండ్లీగా ఉన్నా. షోలో నా పెర్‌ఫార్మెన్స బయటకు ఏం వెళ్లిందో.. ఏం వెళ్లలేదో తెలియదు. టాస్క్‌ల పరంగా చాలా ఫోకస్‌గా ఉన్నా.
ఇప్పుడు హౌస్‌ను చాలా మిస్ అవుతున్నా. ముఖ్యంగా డీలక్స్ రూమ్‌లో నేను రెడీ అయ్యే కార్నర్ ప్లేస్‌ను మాటిమాటికి గుర్తొస్తుంది. అందరూ అక్కడికే వస్తారు. మొదటి నుంచి అమ్మాయిలే ఎలిమినేట్ అవుతున్నారు. చివరకు మేం ముగ్గురమే మిగిలాం. ఈ వారం కూడా అమ్మాయే ఎలిమినేట్ అవుతుందని ఊహించలేదు. తేజ, శివాజీ, అమర్‌దీప్‌లలో ఒకరు ఎలిమినేట్ అవుతారని అనుకున్నా. ఎలిమినేషన్ కారణంగా నా మనోభావాలు దెబ్బతిన్నాయి’’అని నవ్వుతూ చెప్పింది శుభశ్రీ.
‘‘నిజం చెప్పాలంటే అమర్‌దీప్ వల్ల నేను ఎలిమినేట్ అయ్యా. చాలా సిల్లీ రీజన్స్‌తో నామినేట్ చేశాడు. హౌస్‌లో ఉన్నన్ని రోజులు అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉన్నా. ఎవరితోనూ నేను ట్రాక్ నడపలేదు. గౌతమ్, ప్రిన్స్ యావర్ ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. బడ్డీస్ టాస్క్‌లో గౌతమ్ కాస్త స్వార్థపరుడిగా అనిపించాడు.
ఇంటి నుంచి వచ్చిన లెటర్ త్యాగం చేయాల్సి వచ్చినప్పుడు ‘నువ్వు ఏడుస్తున్నావు కాబట్టి, నేను ఇచ్చేస్తా’ అనడం మొదలు పెట్టాడు. గౌతమ్‌తో కలిసి టాస్క్‌లో పాల్గొనడం నాకు మైన్‌స్. ఎందుకంటే తను లెటర్‌ను త్యాగం చేయడానికి సిద్థపడలేదు. ‘నువ్వు చేయొచ్చు కదా’ అన్నట్లు మాట్లాడాడు. అతడు చేయలేనిది నేను చేస్తాననే నమ్మకంతో ఆ పని చేశా.
అనవసరంగా గౌతమ్‌ను బడ్డీగా ఎంపిక చేసుకున్నా. గౌతమ్ ఆడిరచినట్లు ఒక బొమ్మలా నేను ఆట ఆడలేదు. నన్ను ?సవ్ చేసినా, ఎలిమినేట్ చేసినా జనాల చేతిలోనే ఉన్నది. ప్రిన్స్ యావర్ నమ్మకస్తుడు. బిగ్‌బాస్‌లో గ్రూప్ గేమ్ ఆడుతూనే ఉంటారు. సందీప్ మాస్టర్ వాళ్లను లీడ్ చేస్తారు. అమర్‌దీప్, ప్రియాంక, శోభ ఈ నలుగురూ కలిసి ఆడతారు. ఫిజికల్ టాస్క్‌ల్లో స్త్రీ, పురుషులు సమానం కాదు’’ అని చెప్పుకొచ్చింది.