బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న జానకి కలగనలేదు సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది అనే విషయానికి వస్తే…భానుమతి ఇంటికి వెళ్లిన రామా జానకి తిరిగి ఇంటికి వెళ్తామని చెప్పగానే భానుమతి అలుగుతుంది.ఇక మేం బట్టలు కూడా తెచ్చుకోలేదని చెప్పడంతో రామా కోసం తన భర్త బట్టలను జానకి కోసం తన పెళ్లినాటి చీరలను ఇవ్వడంతో ఇద్దరూ ఆ బట్టలు వేసుకొని ఎంతో సంతోషపడతారు.ఇక భానుమతి రామ కోసం ఇష్టమైన పుట్టగొడుగులు కూర చేస్తానని చెప్పగా జానకి నేను చేస్తానని భానుమతి చెప్పిన విధంగా చేస్తుంది.
ఇలా ఆరుబయట పొయ్యి పై వంట చేస్తూ రామా జానకి ఇద్దరు కూడా రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లిపోతారు. ఇక వంట చేయడం పూర్తీ అయిన తర్వాత ఆరుబయట అరిటాకులో భానుమతి వారికి వడ్డిస్తుంది.భానుమతి ప్రేమగా రామకు అన్నం తిని పెడుతూ ఉండగా కొడుకు కేనా ఈ కోడలికి పెట్టరా అంటూ జానకి అలుగుతుంది. ఇక భానుమతి జానకికి కూడా అన్నం తినిపిస్తుంది. ఇక వీరిద్దరూ కలిసి ప్రేమగా భానుమతికి అన్నం తిని పెడతారు.
ఇక జానకి పరిగెడుతూ ఉంటే రామ తనని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఒకరిపై ఒకరు పడుతూ
ఒక రొమాంటిక్ సాంగ్ వేస్తారు.ఇక జానకి ఎంతో అల్లరి అల్లరి చేస్తూ చిలిపి పనులు చేయడంతో రామా సంతోషపడుతూ ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఏంటి జానకి గారు అని అడుగుతారు. ఈరోజు మా అమ్మానాన్నల పెళ్లిరోజు.ఆ విషయం గుర్తు చేసుకొని నేను బాధపడితే పైన వాళ్లు కూడా బాధపడతారు. అందుకే తాను సంతోషంగా ఉన్నానని అసలు కారణం చెబుతుంది.
ప్రతి తల్లిదండ్రులు తమ కూతురుకి అమ్మ నాన్నల చూసుకునే భర్త రావాలని కోరుకుంటారు. నాకు కూడా అలాంటి భర్త వచ్చారు నేను మీ దగ్గర ఎలా ఉన్నాను నా భర్త దగ్గర కూడా అలాగే ఉన్నాను అంటూ జానకి ఎమోషనల్ అవుతుంది.మీ అమ్మానాన్నలను మీరు ఎంతగా ఇష్టపడతారో అర్థం అవుతుంది జానకి గారు మరి వారి ఎంతో ఇష్టంగా నీపై పెట్టుకున్నటువంటి ఆశయం ఎందుకు మీరు మర్చిపోయారు అంటూ రామా మరోసారి తన ఐపీఎస్ చదువును గుర్తు చేస్తాడు.
ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తి కావడంతో తరువాతి ఎపిసోడ్ లో భాగంగా నేనేదో మాట్లాడానని మీరు నిజాయితీ తప్పి నా తమ్ముడిని బయటకు తీసుకువచ్చారు. మీరు తిరిగి కాలేజ్ కి వెళ్ళండి మీరు ఒక ఐపీఎస్ ఆఫీసర్ లాగే నిజాలు తెలుసుకొని మాధురి కేసు విషయంలో అసలు నిజం బయటకు రాబట్టండి అంటూ తనని ప్రోత్సహిస్తూ ఐపీఎస్ పరీక్షలకు సిద్ధం కమ్మని చెబుతాడు.