బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి జానకి కలగనలేదు సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందనే విషయాన్ని వస్తే… తన తల్లి తెచ్చిన బట్టలు తన చేతి కుండా తనకు ఇవ్వకపోవడంతో రామ బాధపడతాడు. రామా బాధపడుతూ ఉంటే ఎప్పటిలాగే జానకి తనని ఓదార్చే తనకు ధైర్యం చెబుతుంది. అయితే వీరి మాటలు గోవిందరాజు వింటాడు.భోగి పండుగ రోజు పాత వస్తువులే కాదు పాత జ్ఞాపకాలను కూడా మంటల్లో వేసి సంతోషంగా ఉండాలి అంటూ తనని నవ్వించే ప్రయత్నం చేస్తుంది.రామ బాధపడుతూ ఉంటే జానకి తనకు చెక్కిలిగింతలు పెట్టి నవ్విస్తుంది. జీవితంలో గెలవాలి అంటే ప్రతి ఒక్కరికి జానకి లాంటి భార్య కావాలి జానకి రామాను ఎప్పుడు ఓడిపోనివ్వదు అని మనసులో అనుకుంటారు.
జ్ఞానాంభ దగ్గరకు వెళ్లిన గోవిందరాజులు అందరికీ కొత్త బట్టలు ఇచ్చావు అయితే ఆ కొత్త బట్టలు మనసుకు సంతోషాన్ని ఇవ్వాలి అని చెబుతాడు నువ్వు రేపు నీ కోపాలన్నింటినీ పక్కనపెట్టి నీ మొహం లో కేవలం చిరునవ్వు మాత్రమే ఉండాలి. మొదటిసారి అడుగుతున్నాను నాకు మాట ఇవ్వు జ్ఞానం అని గోవిందరాజులు అడిగేసరికి జ్ఞానాంబ కూడా తనకు మాట ఇస్తుంది.ఇక మరుసటి రోజు తెల్లవారుజామున భోగిమంటలు వేయడం కోసం జానకి అన్ని సిద్ధం చేసి అందరిని నిద్ర లేపుతుంది ఇక అందరూ వచ్చినప్పటికీ జ్ఞానాంబ మాత్రం రాదు.అయితే ఆమె చివరిలో వచ్చి అందరికీ నవ్వుతూ భోగి శుభాకాంక్షలు చెప్పడంతో ఒక్కసారిగా మల్లికా షాక్ అవుతుంది.
ఇక జానకి మీ చేతుల గుండా భోగి వెలిగించండి అత్తయ్య అంటూ చెప్పడంతో జ్ఞానంబ సంతోషంగా భోగి మంటలు వేస్తుంది.ఇలా అందరూ భోగిమంటలు దగ్గర సరదాగా గడుపుతోండగా రామ చేయి మంటలలో పడిపోవడంతో రామా జాగ్రత్త అంటూ జ్ఞానాంభ తన కొడుకుని కాపాడటంతో తన తల్లి తనతో మాట్లాడినందుకు రామ ఎంతో సంతోషపడతారు.ఇక విష్ణుకి మల్లిక రామా కు జానకి కుంకుడుకాయతో తలంటి స్నానం చేస్తూ ఉండగా కాసేపు అందరూ విష్ణును సరదాగా ఆటపట్టిస్తారు.మొత్తానికి జ్ఞానాంభ తన భర్తకు ఇచ్చిన మాట కోసం తన కోపాన్ని పెట్టి కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడపడంతో తన కుటుంబ సభ్యులు మొత్తం ఎంతో సంతోషంగా ఉంటారు.