రామాను అవమానపరిచిన మల్లిక…. కన్నీళ్లు పెట్టుకున్న జానకి… జ్ఞానాంభ ఇంట్లో మొదలైన సంక్రాంతి సంబరాలు!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి జానకి కలగనలేదు సీరియల్ నేటి ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగిందనే విషయానికి వస్తే… తన నాన్నమ్మ ఇంటి నుంచి వెన్నెల ఇక్కడికి రావడంతో మల్లికా నానమ్మ ఇంట్లో దర్జాగా ఉండమని సలహా ఇవ్వడంతో అది విన్నటువంటి జానకి మల్లికను తిడుతుంది. తను ఈ ఇంటి కోడలు కాదు ఇంటి ఆడపడుచు తనని వెళ్లిపొమ్మని ఎలా చెప్తావు ఇంట్లో నువ్వు ఉండకూడదని ఇతరులను కూడా వెళ్ళిపొమ్మని ఎలా చెబుతావు అంటూ తనకు క్లాస్ పీకుతుంది.ఈ విధంగా వెన్నెల ముందు అవమానించడంతో వెన్నెల ముందే జానకి పరువు తీయాలని మల్లిక అనుకుంటుంది.

రామ ఇంటి కోసం ఇంత కష్టపడుతున్న తనని ఎవరు అర్థం చేసుకోలేదు రాముడిని అర్థం చేసుకున్నది నువ్వే అంటూ జానకి వద్ద గోవిందరాజులు మాట్లాడతారు.అదే సమయంలో మల్లిక వచ్చి వెన్నెలకు వెయ్యి రూపాయలు ఇచ్చి ఇంటి ఆడపడుచులు సంక్రాంతి పండుగకు ఏమైనా కొనుక్కో అని మాట్లాడుతుంది అది చూసిన జానకి రామా గారు అందరికీ బట్టలు తెస్తానని వెళ్లారు అంటూ మాట్లాడుతుంది.దీంతో మల్లిక ఎప్పుడు తీసుకువస్తారు జానకి ముగ్గురు అన్నలు ఉండి ఇంటి ఆడపడుచుకి కనీసం జాకెట్ ముక్క అయినా పెట్టలేదు అనుకోరు అందుకే ఈ వేయి రూపాయలు తీసుకొని చెప్పడంతో వెన్నెల వెన్నెల మాత్రం తన అన్నయ్య ఇంటిలో ఉన్న వారందరి గురించి ఆలోచిస్తూ ఉంటాడని తనకు సపోర్ట్ చేస్తుంది.

మీ అన్నయ్య ఎవరికో అప్పు ఇచ్చానని చెప్పి 20 లక్షల ఆస్తి సొంతం చేసుకున్నారు. ఈ కుటుంబం విడిపోతే కానీ ఆ డబ్బు బయటకు రాదు అని మాట్లాడుతూ ఉండగా అప్పుడే రామ కాళీ చేతులతో ఇంటికి వస్తాడు.దీంతో మల్లికా జానకిని మరింత అవమానకరంగా మాట్లాడటమే కాకుండా రామను కూడా అవమాన పరుస్తుంది. దీంతో జానకి బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది అప్పుడు రామ తన గురించి మీకు తెలిసిందే కదా ఏం బాధపడకండి అని చెబుతాడు.ఇలా మల్లిక మాటలు విని వెన్నెల కూడా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటే ఎలా అని బాధపడగా చిన్నప్పటినుంచి అన్నయ్య కష్టం చూస్తూ పెరిగాను ఇలా మధ్యలో ఎవరో వచ్చి అన్నయ్య గురించి చెడుగా చెప్తే ఎలా నమ్ముతాను అని వెన్నెల ఓదారుస్తుంది.

అంతలోపే జ్ఞానంభ ఇంట్లో అందరికీ కొత్త బట్టలు తీసుకువచ్చి ఇస్తుంది.ప్రతి ఏడాది మనం సంక్రాంతి సంబరాలు ఎలా చేసుకుంటామో ఈ ఏడాది కూడా అంతే సంతోషంగా జరుపుకోవాలని చెబుతుంది. ఇక తన తెచ్చిన కొత్త బట్టలను జెస్సీ మల్లికకు ఇచ్చినప్పటికీ రామా జానకికి మాత్రం తన చేతులు గుండా ఇవ్వదు. వెన్నెలకు ఇవ్వమని చెప్పగా వెన్నెల మాత్రం నువ్వే ఇవ్వచ్చు కదా అని మాట్లాడుతుంది. ఇక జ్ఞానాంభ మాట దాటి అక్కడ నుంచి వెళ్లిపోగా వెన్నెల తన చేతుల గుండా జానకి రామాకు కొత్త బట్టలు ఇస్తుంది.