ముగ్గుల పోటీల్లో పాల్గొన్న అత్తా కోడళ్ళు… అందరి సంతోషం పై నీళ్లు చల్లిన మల్లిక!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి జానకి కలగనలేదు సీరియల్ నీటి ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగిందనే విషయాన్నికి వస్తే జ్ఞానంబ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. అయితే తమ కష్టాలన్నీ తీరిపోయి ఎప్పటిలాగే మన ఇంట్లో సంతోషం ఉండాలని దేవుని ప్రార్థించమని చెబుతుంది. ఇలా అందరూ దేవుడిని ప్రార్థించగా జానకి మల్లికా ముగ్గులు వేస్తూ ఉంటారు. అయితేఎప్పుడు ముగ్గుల పోటీలు పెట్టిన జ్ఞానంబనే గెలిచేది అంటూ గోవిందరాజులు చెప్పగా అది అప్పుడు ఇప్పుడు కాదు అంటూ మల్లిక మాట్లాడుతుంది. అయితే ఈ అత్తా కోడళ్ళు ముగ్గుల పోటీలకు సై అంటారు. కానీ తాను ఈ పోటీలో గెలిస్తే అడిగింది చేయాలని మల్లికా కండిషన్ పెడుతుంది.

ఇలా మల్లికా సెల్ఫోన్లో చూస్తూ ముగ్గు వేస్తూ ఉండగా విష్ణు డిస్టర్బ్ చేస్తాడు. మల్లిక ముగ్గును చూసి అందరూ నవ్వుకుంటారు.జానకి మాత్రం తన అత్తయ్య వేసిన ముగ్గు చాలా బాగుంది అని చెప్పడంతో జ్ఞానంభ ముగ్గు గొప్పతనం గురించి వివరిస్తుంది. ఇలా అందరూ సరదాగా ఉన్న సమయంలో అక్కడికి ఒకాయన వచ్చి ప్రతి ఏడాది అనాధ ఆశ్రమానికి స్వీట్స్ బుక్స్ పంపిస్తారు ఈ ఏడాది కూడా పంపిస్తారా అని అడగడంతో వెంటనే మల్లికా కలుగజేసుకొని తన నోటి దురుసుతో మేము ఒకప్పటిలా ఇప్పుడు దానం ఇచ్చే పరిస్థితిలలో లేము దానం ఇస్తే తీసుకునే పరిస్థితులలో ఉన్నామని మాట్లాడుతుంది.

దీంతో గోవిందరాజులు మనం ఇంట్లో కాదు ఉన్నది రోడ్డు మీద ఉన్నామని చెప్పినప్పటికీ మల్లిక మాత్రం ఆగకుండా మాట్లాడుతుంది. దీంతో జ్ఞానంబ బాధపడి లోపలికి వెళ్ళిపోతుంది. ప్రతి ఏడాది అమ్మ తన తమ్ముడి గుర్తుగా పేద పిల్లలకు స్వీట్స్ బుక్స్ అన్ని పంపించేది. ఈ ఏడాది అది కూడా చేయలేని బాధపడుతూ ఉంది అంటూ రామ జానకికి చెబుతాడు. ఈ విషయం గురించి విష్ణు ఆలోచిస్తూ ఉండగా మల్లిగా ఇప్పుడు కనుక మీరు ఆయనకు దానం చేస్తారని మాట ఇస్తే అసలు ఊరుకోనని విష్ణుకి వార్నింగ్ ఇస్తుంది.అది విన్నటువంటి జానకి తను మీ మామయ్య గురించి అలా మాట్లాడుతుంటే ఏం మాట్లాడలేకపోతున్నావు విష్ణు అంటూ విష్ణుకి కూడా క్లాస్ పీకుతుంది.