సహజీవనం చేస్తున్న జబర్దస్త్ కమెడియన్స్.. పెళ్లి కాకుండానే చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారుగా?

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతోమంది మంచి గుర్తింపు సంపాదించుకొని ఇండస్ట్రీలో కమెడియన్లుగా కొనసాగుతున్నారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా గుర్తింపు సంపాదించుకున్న వీళ్ళు వెండితెరపై కూడా అవకాశాలను అందుకున్నారు.ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా గుర్తింపు సంపాదించుకున్న వారిలో జోర్దార్ సుజాత రాకింగ్ రాకేష్ ఒకరు.బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా అందరికీ ఎంతో సుపరిచితమైన జోర్దార్ సుజాత అనంతరం జబర్దస్త్ కార్యక్రమంలో రాకింగ్ రాకేష్ స్కిట్ లో సందడి చేశారు.

ఇక వీరిద్దరూ ఎన్నోసార్లు లవ్ స్కిట్ లను చేస్తూ ప్రేక్షకుల ముందుకు రావడంతో ఇది కేవలం స్కిట్ లో భాగమేనని అందరూ అనుకున్నారు కానీ నిజంగానే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే సుజాత సైతం ఈ విషయాన్ని అధికారకంగా తెలియజేస్తూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ విషయం అందరితో పంచుకున్న క్షణం నుంచి వీరిద్దరూ చట్టాపటాలు వేసుకొని ఎన్నో ప్రదేశాలలో తిరుగుతూ తమ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న ఈ ఇద్దరు సహజీవనం చేస్తున్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో ఇద్దరు సహజీవనంలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇలా వీరి గురించి ఈ వార్తలు రావడమే కాకుండా తాజాగా ఈటీవీలో ప్రసారమవుతున్న మిస్టర్ అండ్ మిసెస్ కార్యక్రమానికి కూడా ఈ జంట హాజరు కావడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరింది. మొత్తానికి రాకింగ్ రాకేష్ సుజాత ఇద్దరు కూడా వేదికపై అలాగే సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు.