పరాకాష్టకు చేరిన జ్యోత్స్న శాడిజం.. భర్త వద్దన్న పని చేయడానికి సిద్ధమైన దీప!

స్టార్ మా లో ప్రసారమవుతున్న కార్తీకదీపం 2 రోజుకో ట్విస్ట్ తో ప్రేక్షకులని అలరిస్తుంది. టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న ఈ సీరియల్ డిసెంబర్ 28 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. దీప వంట మనిషిగా చేస్తున్న ఇంటికి కార్తీక్ సరుకులు తీసుకొని వస్తాడు. అక్కడ ఒకరు ఒకరు చూసుకుని షాక్ అవుతారు ఆ దంపతులు. అప్పుడే ఇంటి ఆవిడ నీ భర్తకి సూపర్ మార్కెట్లో ఉద్యోగం ఇప్పిస్తానంటుంది. ఇబ్బందిగా ఫీలయిన దీప వంట చేయాలి అంటూ లోపలికి వెళ్ళిపోతుంది. అయితే సరుకులు అన్ని లిస్ట్ ప్రకారం ఇచ్చేసిన తర్వాత నేను బయలుదేరుతాను అంటాడు కార్తీక్. సరుకులు తెచ్చినందుకు కార్తీక్ కి 50 రూపాయలు టిప్ ఇవ్వబోతుంది ఇంటావిడ.

అయితే తీసుకోకుండా అక్కడినుంచి వెళ్ళిపోతుంటాడు కార్తీక్. సూపర్ మార్కెట్లో పనిచేస్తున్న పొగరుకు ఏం తక్కువ లేదు అంటుంది హౌస్ ఓనర్. ఆ మాటలు విన్న దీప మనసులోనే చాలా బాధపడుతుంది. మరోవైపు ఇంటికి వచ్చిన మనవరాలు తో మీ అమ్మ నువ్వు మీ బావ దగ్గరికి వెళ్ళిపోయావేమో అని చాలా కోపంగా ఉంది అంటుంది పారిజాతం. తను బావ ఇంటికి వెళ్లానని అక్కడ జరిగిందంతా చెప్తుంది జ్యోత్స్న. బావకి ఎక్కడ ఉద్యోగం దొరక్కుండా ఉంటే తిరిగి తన దగ్గరికి వస్తాడు, తన వాడు అవుతాడు అంటుంది జోత్స్న. దీప మూలన కూర్చుని బాధపడే రకం కాదు అంటుంది పారిజాతం. దీప ఏం చేయబోతుందో మనం తెలుసుకోవాలి అంటుంది జ్యోత్స్న. మరోవైపు కార్తీక్. దీప ఇద్దరూ ఒకేసారి ఇంటికి వస్తారు. ఆ మహానుభావుడు ఉద్యోగం ఇచ్చాడా అని కొడుకుని అడుగుతుంది కాంచన. అతను మహానుభావుడు కాదమ్మా మోసగాడు, వరసకి నాన్న అవుతాడు. పేరు శ్రీధర్ అనటంతో షాక్ అవుతుంది కాంచన. తిట్టారా అని దీప అడిగితే ఎగతాళి చేశారు అని చెప్తాడు కార్తీక్.

తర్వాత ఇద్దరూ లోపలికి వెళ్లి చాలాసేపు మాట్లాడుకున్న తరువాత ఇద్దరూ తాము చేస్తున్న పనులకి ఇక వెళ్ళకూడదని నిర్ణయం తీసుకుంటారు. మరోవైపు స్వప్న వాంతులు చేసుకుంటూ ఉంటే ప్రెగ్నెంట్ ఏమో అనుకొని ఆనంద పడుతున్న కాశి. నువ్వు అనుకున్నట్లు కాదని, నువ్వు చేసిన వంటకి వాంతులు అవుతున్నాయి అని స్వప్న చెప్పటంతో కాశి నిరాశపడతాడు. అప్పుడే దాసు వచ్చి దీప పిలిచింది నేను వెళ్తాను అనడంతో మేము కూడా వస్తాము అంటూ స్వప్న దంపతులు కూడా బయలుదేరుతారు. నెక్స్ట్ సీన్లో అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే కొడుకు పరిస్థితిని తలుచుకొని బాధపడుతుంది కాంచన. అందరూ ఆమెకి ధైర్యం చెప్తారు. అప్పుడే దీప టిఫిన్ సెంటర్ పెట్టాలని ఆలోచన గురించి చెప్తుంది.

అయితే కార్తీక్ అందుకు అభ్యంతరం చెప్తాడు. అయితే అందరూ కలిసి అతడిని ఒప్పిస్తారు. టిఫిన్ సెంటర్ కి దీప పేరు పెట్టమని సలహా ఇస్తుంది కాంచన. కానీ ఆ విషయం ముందు కార్తీక్ కి చెప్పమంటుంది. అయితే అందరూ కలిసి కాంచనని కార్తీక్ చెప్పి ఒప్పించమని బ్రతిమిలాడుతారు అందుకు కాంచన ఒప్పుకుంటుంది. తర్వాత ఎవరెవరు ఏ పనులు చేయాలో డిసైడ్ చేసుకుంటారు అప్పుడు కాంచన టిఫిన్ సెంటర్ కి దీప ఏం పేరు పడుతుందో నీకు తెలుసా అని స్వప్నని అడుగుతుంది. నేనయితే ఆపేరే అనుకుంటున్నాను అంటుంది స్వప్న. ఏ పేరు అంటుంది కాంచన. సర్ప్రైజ్ అంటుంది స్వప్న. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.