పెళ్ళై 20 ఏళ్లయినా తల్లిదండ్రులు కాలేని ఓ బుల్లితెర జంట.. అందుకే పిల్లల్ని కనలేదంటూ క్లారిటీ ఇచ్చిన వైనం!

చక్రవారం సీరియల్‌తో పాపులర్ అయిన ఇంద్రనీల్, మేఘనలు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమే. ఈ సీరియల్లో ఇద్దరూ అత్త అల్లుడు క్యారెక్టర్స్ లో కనిపిస్తారు. మేఘన సీరియల్స్ ని పక్కన పెట్టేసి యూట్యూబ్ మీద కాన్సెంట్రేట్ చేసినట్లుగా కనిపిస్తుంది అందులో వంటలు వీడియోలు ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటుంది తాజాగా పచ్చళ్ళ బిజినెస్ కూడా స్టార్ట్ చేసింది. ఇంద్రనీలు ఆఖరుగా గృహలక్ష్మి సీరియల్లో సామ్రాట్ క్యారెక్టర్ లో కనిపించాడు. తర్వాత అతని చేతిలో పెద్దగా ప్రాజెక్ట్స్ ఉన్నట్టు అప్డేట్స్ లేవు.

అయితే చక్రవాకం సీరియల్ అప్పుడే వీరిద్దరికి పరిచయం అయింది త్వరలోనే పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే మేఘన ఇంద్రనీల్ కన్నా వయసులో పెద్దది కావటం మూలంగా వీళ్ళ పెళ్ళికి పెద్దలు అభ్యంతరం చెప్పారు అయినా వాళ్లని పట్టుబట్టి ఒప్పించి 2004 డిసెంబర్ 12న పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి అయ్యి దాదాపు 20 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఇప్పటికీ ఇంకా వారికి సంతాన భాగ్యం కలగలేదు ఇదే విషయంపై వాళ్లకి చాలా ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయట వీటికి సమాధానం గా ఈ విధంగా చెప్పుకొచ్చారు ఆ దంపతులు.

నిజంగా మాకు పిల్లలు అంటే చాలా ఇష్టం కానీ మాకు పిల్లలు కలగలేదు, పిల్లలని కనడం కోసం అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి ఈ పూజ చేయండి అంటూ చాలామంది చాలా సలహాలు ఇస్తూ ఉంటారు. అయితే మేము అందరికీ చెప్పేది ఒకటే ఇప్పుడు మేము 41 లో ఉన్నాము మా పిల్లలకి 20 ఏళ్లు వచ్చేసరికి మాకు 60 ఏళ్లు వస్తాయి అప్పుడు మాకు ఏమైనా అయిందంటే పిల్లలు రోడ్డున పడిపోతారు అందుకే వాళ్ళ కోసమే ఆలోచించి మేము ఇలాంటి నిర్ణయం తీసుకున్నాము.

అయినా పిల్లలు లేకపోయినా మేము ప్రశాంతంగా ఉన్నాము కానీ మీరు మా మీద చూపించే శ్రద్ధ నాకు ఇబ్బందిగా ఉంది ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేయండి అని అసలు కారణాన్ని చెప్పుకొచ్చారు ఈ జంట. అయితే వీరి సమాధానం పట్ల కొందరు పాజిటివ్గా రెస్పాండ్ అయితే మరి కొందరు మాత్రం నెగిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. ఎవరు ఏమన్నా నాకు పిల్లలు లేకపోయినా మేము హ్యాపీగానే ఉంటాం అంటున్నారు ఈ జంట.