బుల్లితెర కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హైపర్ ఆది కేవలం జబర్దస్త్ కార్యక్రమంలో మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా సందడి చేస్తున్నారు.ఇలా తన అద్భుతమైన కామెడీ టైమింగ్ పంచ్ డైలాగులతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి హైపర్ ఆది తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా తన రెమ్యూనరేషన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
సాధారణంగా సెలబ్రిటీల గురించి ఎన్నో వార్తలు వస్తుంటాయి. ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమంలో భాగంగా వారి గురించి వచ్చేటటువంటి రూమర్స్ పై స్పందించి కమెడియన్స్ సమాధానం చెప్పారు. ఈ క్రమంలోనే హైపర్ ఆది ఒక్కో స్కిట్ కోసం ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటారనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు హైపర్ ఆది సమాధానం చెబుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియని చెప్పారు.
హైపర్ ఆది ఈ సందర్భంగా మాట్లాడుతూ తాము ఒక స్కిట్ చేయాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఆ స్కిట్ కి సరిపడ డైలాగులు, పంచులు రాసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఒక స్కిట్ చేయడానికి తాను చాలా కష్టపడాల్సి ఉంటుంది కనుక తాను కూడా ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటాను అంటూ రెండు చేతులను చూపించి అసలు విషయం పక్కకు తోసారు.ఇలా మొదటిసారి రెమ్యూనరేషన్ గురించి మాట్లాడిన ఎంత తీసుకుంటున్నారనే విషయాన్ని మాత్రం ఆది వెల్లడించలేదు.