‎Jabardasth: హైపర్ ఆది వల్లే జబర్దస్త్ షో మానేశాను.. సంచలన వ్యాఖ్యలు చేసిన లేడి కమెడియన్!

Jabardasth: జబర్దస్త్ కామెడీ షో గురించి మనందరికీ తెలిసిందే. ఈటీవీలో కొన్ని ఏళ్లుగా సక్సెస్ఫుల్గా ప్రసాదం అవుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కడుపుబ్బా నవ్విస్తూ బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఒకప్పుడు ఈ షోలో చాలామంది కమెడియన్లు ఉండేవారు. కానీ రాను రాను కొన్ని కొన్ని కారణాలవల్ల జబర్దస్త్ కమెడియన్లు ఈ షో నుంచి పక్కకు వెళ్లిపోయారు. కాగా చాలామంది ఆర్టిస్టులు జబర్దస్త్ షో ద్వారా సెలబ్రిటీ హోదాను దక్కించుకున్న విషయం తెలిసిందే. జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కొంతమంది వెండితెరపై కూడా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. జబర్దస్త్ తర్వాత చాలా మందికి సినిమా ఆఫర్స్ కూడా వచ్చాయి.

‎కొంతమంది నటులుగా మారితే మరికొంతమంది దర్శకులుగా మారారు. వేణు, ధన రాజ్ లాంటివారు దర్శకులుగా సినిమాలు చేస్తున్నారు. అలాగే హైపర్ ఆది, రాఘవ, గెటప్ శ్రీను ఇలా కొంతమంది కమెడియన్స్ గా చేస్తున్నారు. అలాగే సుడిగాలి సుధీర్, రష్మీ హీరో, హీరోయిన్ గా సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంటున్నారు. అయితే వీరిలో ప్రత్యేకంగా హైపర్ ఆది గురించి చెప్పుకోవాలి. కామెడీ స్కిట్స్ రాసే దగ్గర నుంచి మొదలు పెట్టి ఇప్పుడు స్టార్ కమెడియన్స్ లో ఒకడిగా ఎదిగాడు ఆది. అయితే చాలామంది హైపర్ ఆది వేసే పంచులు స్కిట్లు ఇష్టపడితే మరికొందరు మాత్రం అన్ని డబుల్ మీనింగ్ డైలాగులే అని మండిపడుతూ ఉంటారు. జబర్దస్త్ లో కమెడియన్ గా చేస్తూనే శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలతో పాటు చాలా సినిమాల్లో నటించి మెప్పించారు హైపర్ ఆది. ఇది ఇలా ఉంటే ఇటీవల జబర్దస్త్ యాంకర్ అనసూయ హైపర్ అది వల్లే నేను జబర్దస్త్ మానేశా అని కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

‎ ఆది పంచుల వల్ల విసుగొచ్చే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేశా అని అనసూయ కామెంట్స్ చేయడం వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు మరో బ్యూటీ కూడా ఆది వల్లే జబర్దస్త్ మానేశా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఆమె ఎవరో కాదు ఈ మధ్యకాలంలో బాగా పేమస్ అయిన రీతూ చౌదరి. సోషల్ మీడియా ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ మధ్య కొంతకాలం పాటు లేడీ కమెడియన్గా జబర్దస్త్ లో చాలా స్కిట్లలో నటించిన విషయం తెలిసిందే. అలా యాంకర్ గా లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది రీతూ. ఇది ఇలా ఉంటే హైపర్ ఆది గురించి రీతు చౌదరి మాట్లాడుతూ..

ఆది నేను కలిసి జబర్దస్త్ షోలో కొన్ని స్కిట్స్ చేశాము. ఆది జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత నేను అక్కడ ఒక్కదాన్నే అయిపోయాను. ఆది వెళ్ళిపోయినా తర్వాత నేను ఒక్కదాన్నే ఇక్కడ ఏం చేస్తాను అని నేను కూడా బయటకు వచ్చేసా అని తెలిపింది. అలాగే ఆమె మాట్లాడుతూ.. నేను వీజే అవ్వాలని వచ్చాను.. మెల్లగా ఎదుగుతూ.. ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నాను. కొన్ని టీవీ షోలు చేస్తున్నా అలాగే సినిమాల్లో ఛాన్స్ లకోసం ఎదురుచూస్తున్నా అని తెలిపింది. అలాగే కొన్ని ఆఫర్స్ కూడా వస్తున్నాయి. కానీ నేను కాస్త బోల్డ్ కాబట్టి నాకు అలాంటి పాత్రలే ఇస్తాం అంటున్నారు. బోల్డ్ పాత్రలు చేయడానికి నేను రెడీ కానీ దానికి ప్రాధాన్యత ఉండాలి అని చెప్పుకొచ్చింది రీతూ చౌదరి.