Sudigali Sudheer: తెలుగు బుల్లితెర, వెండితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుదీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కమెడియన్ గా, డాన్సర్ గా, మెజీషియన్ గా, యాంకర్ గా ఇలా అన్ని రంగాలలో రాణిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. మల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకున్నారు సుడిగాలి సుధీర్. అయితే సుధీర్ కి గుర్తింపు దక్కింది మాత్రం జబర్దస్త్ షో ద్వారానే అని చెప్పాలి. ప్రస్తుతం యాంకర్ గా, కమెడియన్ గా, హీరోగా దూసుకుపోతున్నాడు.
అయితే సుధీర్ గత కొన్నాళ్ల క్రితం జబర్దస్త్ ను మానేసిన సంగతి తెలిసిందే. ఇటీవల జబర్దస్త్ రీ యూనియన్ జరిగితే కూడా అందరూ వచ్చినా సుధీర్ మాత్రం రాలేదు. ఇదే విషయం గురించి తాజాగా జబర్దస్త్ నటుడు మహీధర్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వాఖ్యలు చేసారు. ఈ సందర్బంగా మహీధర్ మాట్లాడుతూ.. అదిరింది షోకి కొంతమంది జబర్దస్త్ ని వదిలేసి వెళ్లిపోయారు. ఆది, సుధీర్ కూడా వెళ్ళాలి. కానీ సుధీర్ కి ఇక్కడే వేరే షోలు ఉన్నాయి.
ఆదికి అగ్రిమెంట్స్ ఉన్నాయి అందుకే వెళ్ళలేదు. అయితే సుధీర్ వేరే ఛానల్ లో సింగింగ్ షోకి యాంకర్ గా ఛాన్స్ వస్తే కామెడీ షో కాదు అని ఒప్పుకున్నాడు. కానీ జబర్దస్త్ మేనేజ్మెంట్ అది కామెడీ షో కాకపోయినా అది కూడా చేయద్దు అన్నారు. దాంతో సుధీర్ అక్కడ ఒప్పుకోవడంతో జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయాడు అని తెలిపాడు మహీదర్. అతను చాలా రిజర్వ్‌డ్. ఎవ్వరి ఫోన్స్ లిఫ్ట్ చేయడు. సెట్ లో కూడా షూట్ లేకపోతే కారవాన్ లో ఉంటాడు. ఎవ్వరితో ఎక్కువగా మాట్లాడడు. ఆయన ఎవరితో కాంటాక్ట్ లో ఉండరు. బయటకు ఫంక్షన్స్ కు కూడా రాడు. ఎక్కువగా ఆది, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ కి మాత్రమే కాంటాక్ట్ లో ఉంటాడు. మొదటి నుంచి అంతే సింగిల్ గా ఉంటాడు. సుధీర్ తో ఏదైనా అర్జెంట్ గా మాట్లాడాలి అంటే గెటప్ శ్రీను అన్న ద్వారా కాంటాక్ట్ అవ్వాల్సిందే అని తెలిపాడు.
Sudigali Sudheer: సుధీర్ జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడానికి కారణం అదే.. షాకింగ్ కామెంట్స్ చేసిన కమెడియన్!
