Rocking Rakesh: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో రాకింగ్ రాకేష్ ఒకరు. జబర్దస్త్ కార్యక్రమాల ద్వారా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన నిర్మాతగా హీరోగా కూడా మారారు. ప్రస్తుతం పలు బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తున్నారు. ఇక రాకింగ్ రాకేష్ రోజా మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాకేష్ ఆమెను అమ్మ అంటూ ఎంతో ఆప్యాయంగా పిలుస్తారు. ఇక రోజా కూడా రాకేష్ కుటుంబాన్ని తన కుటుంబంగా భావించి రాకేష్ కు పూర్తిస్థాయిలో అండగా నిలిచారు.
రాకేష్ జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగుతున్న సమయంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోగా రోజా నేనున్నానంటూ తనకి సహాయం చేశారు. అందుకే ఎప్పుడూ రాకేష్ రోజా గారి పట్ల అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు. ఇక రోజా చేతుల మీదుగా రాకేష్ వివాహం జరిపించారు. అలాగే తన సినిమాను కూడా ముందుకు నడిపించారు. ఇకపోతే ఇటీవల తన కుమార్తె పుట్టినరోజు వేడుకలలో కూడా రోజా పాల్గొని సందడి చేశారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన రోజా గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రోజా గారు మాకు తిండి లేని సమయం నుంచి ఆమె తెలుసు. అప్పుడు ఆమె ఆదరణ మాపై ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది అయితే కేవలం నా ఒక్కరి విషయంలోనే కాదు మా జబర్దస్త్ కుటుంబంలో ఎవరికైనా ఆపద ఉంది అంటే రోజా గారు నేనున్నానంటూ ముందుకు వస్తారు. ఇలాంటి ఒక మంచి వ్యక్తి గురించి ఎవరైనా అంటే చూస్తూ ఊరుకోనని తెలిపారు.
ఇప్పుడు కొంతమంది విశ్వాసం లేని వారు రోజా గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. వాడు మా వాడు అని భావన ఉంటే ఈపాటికి తన దగ్గరకు వెళ్లి నువ్వు చేస్తున్నది తప్పు అంటూ సర్ది చెప్పేవాడిని కానీ వాడు ఆరోగ్య పరిస్థితి బాగాలేక అలా మాట్లాడుతున్నాడా లేక డబ్బు కోసం మాట్లాడుతున్నారా అనేది తెలియదు అలాంటి వారిని అలాగే వదిలేస్తేనే మంచిదని పరోక్షంగా ఆర్పీ గురించి మాట్లాడారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.ఆడపిల్లలకు అన్యాయం జరిగితే ఊరుకోను.. ఏ ఆడబిడ్డకి అన్యాయం జరిగినా నేను అక్కడ ఉంటా అదీ ఇదీ అని పవన్ కళ్యాణ్ గారు అంటారు కదా.. మరి రోజా గారిని బాడీ షేమింగ్ చేసి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు కట్టడి చేయడం లేదో అడిగారా? అని రాకేష్‌ని అడగ్గా ఆయన అలా అన్నారా? అని ఉంటారు లేండి అంటూ రాకేష్ తెలిపారు. నేను పవన్ కళ్యాణ్ కు పెద్ద అభిమానిని అంటూ యాంకర్ చెప్పడంతో మీరు పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్ కావచ్చు కానీ నేను కాదు అంటూ ఈయన తెలిపారు. ఆయన మహిళలని కించపరుస్తూ మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు మీలాంటి అభిమాన జర్నలిస్టులే తనని అడిగి తెలుసుకోవాలి అంటూ కౌంటర్ ఇచ్చారు.
