బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమం 11 వారాలు పూర్తి చేసుకొని 12 మంది కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేశారు. ఈ క్రమంలోనే 11వ వారం నామినేషన్స్ లో ఉన్నటువంటి వారిలో మెరీనా ఎలిమినేట్ కావడంతో ఆమె భర్త రోహిత్ ఎంతో ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. నామినేషన్ లో ఉన్నటువంటి 9 మంది కంటెస్టెంట్లలో డేంజర్ పొజిషన్లో ఇనయా,మెరీనా ఉండగా చివరికి మెరీనా ఎలిమినేట్ అంటూ బిగ్ బాస్ ప్రకటించడంతో మెరీనా బిగ్ బాస్ హౌస్ వీడారు. ఇక ఈమె ఎలిమినేట్ కావడంతో ఆమె భర్త రోహిత్ ఎంతో ఎమోషనల్ అయ్యారు.
ఇక గత సీజన్లో కూడా బిగ్ బాస్ సెలబ్రెటీ కపుల్ ను హౌస్ లోకి పంపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మెరీనా రోహిత్ పలు బుల్లితెర సీరియల్స్, కార్యక్రమాలలో సందడి చేసే పెద్ద ఎత్తున ప్రేక్షకులను సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఈ దంపతులకు బిగ్ బాస్ అవకాశం కూడా లభించింది. ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్న ఈ జోడి హౌస్ లోకి వెళ్లేముందు ఇద్దరిని ఒకే కంటెస్టెంట్ గా భావించి చూడాలని బిగ్ బాస్ వెల్లడించారు. అయితే హౌస్ లోకి వెళ్ళిన తర్వాత వీరిద్దరిని విడివిడిగా విభజించారు.
ఇలా పలు టాస్కులలో ఎంతో అద్భుతంగా ఆడుతూ 11 వారాలపాటు హౌస్ లో కొనసాగిన మెరీనా చివరికి 11వ వారంలో బిగ్ బాస్ హౌస్ వీడారు.ఇక ఈమె ఎలిమినేట్ కావడంతో 11 వారాలకు గాను మెరీనా ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయం గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే మెరీనా 11 వారాలకు గాను భారీగానే పారితోషకం తీసుకున్నట్టు సమాచారం.హౌస్ లోకి వెళ్లే ముందు మెరీనా ఒక్క వారానికి సుమారు రెండు లక్షల వరకు రెమ్యూనరేషన్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారట ఈ క్రమంలోనే ఈమె 22 లక్షల పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు సమాచారం.