‎Geeta Singh: గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? కితకితలు మూవీకి అంత అందుకున్నారా?

‎Geeta Singh: తెలుగు సినీ ప్రేక్షకులకు లేడీ కమెడియన్ గీతా సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గీతా సింగ్ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా కితకితలు. ఈ ఒక్క సినిమాతో భారీగా పాపులారిటీని సంపాదించుకుంది. అంతేకాకుండా లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అల్లరి నరేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో తన అద్భుతమైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.

‎చాలామంది గీత సింగ్ అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ కితకితలు హీరోయిన్ అంటే చాలు ఇట్టే గుర్తు పట్టేస్తారు. అయితే కితకితలు తర్వాత పలు సినిమాల్లో కమెడియన్ గా నటించింది కానీ పలు కారణాలతో సినిమాలకు దూరమైపోయింది. ఇటీవలే మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది గీతా సింగ్. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గీతా సింగ్ తన మొదటి సినిమా రెమ్యునరేషన్ తో పాటు కితకితలు మూవీ రెమ్యునరేషన్ గురించి తెలిపింది. ఈ సందర్బంగా గీతా సింగ్ మాట్లాడుతూ.. నా మొదటి సినిమా తేజ గారితో జై సినిమా చేసాను.

‎ ఆడిషన్ కి వెళ్తే సెలెక్ట్ చేసుకున్నారు. అప్పటికి కాలేజీ చదువుతున్నాను. తేజ గారంటే కొడతారు అని అప్పట్లో అందరికి భయం. సినిమాలో ఒక సీన్ లో నేను వేరే నటుడి చెయ్యి పట్టుకొని కొరకాలి. ఆ సీన్ లో నేను నిజంగా కొరికేశా, సెట్ అంతా అందరూ నవ్వేశారు. కట్ చెప్పకుండా నవ్వుతూనే ఉన్నారు నేను చేసిన యాక్టింగ్ కి. ఆ విషయం ఇండస్ట్రీలో తెలిసి ఇవివి సత్యనారాయణ గారు పిలిచి ఎవడిగోల వాడిదే మూవీలో అవకాశం ఇచ్చారు. జై సినిమాకు నాకు పదివేలు రెమ్యునరేషన్ ఇచ్చారు. అప్పట్లో నాకు అది చాలా ఎక్కువ అని తెలిపింది గీతా. అలాగే కితకితలు సినిమా రెమ్యునరేషన్ మాట్లాడుతూ.. అసలు ఆ సినిమాకు నేను రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా పర్లేదు చేద్దాం అని ఫిక్స్ అయ్యాను. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. దాని బడ్జెట్ కేవలం 60 లక్షలు మాత్రమే. థియేటర్స్ మీద వచ్చిందే కాకుండా అప్పట్లోనే జెమిని టీవీ కితకితలు సినిమాకు 8 కోట్లు పెట్టి శాటిలైట్ రైట్స్ కొనుక్కుంది. దాంతో సినిమా అయ్యాక నన్ను పిలిచి డైరెక్టర్ రెండున్నర లక్షలు ఇచ్చారు. నేను వద్దన్నా కూడా ఇచ్చారు అని తెలిపింది గీతా సింగ్. ఈ సందర్బంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.