Sandeep Reddy: వామ్మో స్పిరిట్ కోసం సందీప్ రెడ్డి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా… ఈయన డిమాండ్ మామూలుగా లేదే?

Sandeep Reddy: అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సందీప్ రెడ్డి ఇదే సినిమాని బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చేశారు. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈయన పేరు మారుమోగిపోయింది. ఇక ఈ సినిమా తర్వాత రణబీర్ కపూర్ రష్మిక హీరో హీరోయిన్లుగా ఈయన యానిమల్ అనే సినిమాని చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

యానిమల్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈయన క్రేజ్ భారీగా పెరిగిపోయింది దీంతో సందీప్ రెడ్డి వంగాసినిమా అంటేనే అందరిలోనూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇకపోతే తాజాగా సందీప్ రెడ్డి పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్లో స్పిరిట్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఇక ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా కోసం సందీప్ రెడ్డివంగా తీసుకుపోయే రెమ్యూనరేషన్ కి సంబంధించి వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సందీప్ రెడ్డి ఇప్పటివరకు చేసింది కేవలం మూడు సినిమాలే అయినా ఇండస్ట్రీలో ఈయనకి భారీ డిమాండ్ ఉందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే సినిమా కోసం సందీప్ రెడ్డి ఏకంగా 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని తెలుస్తోంది. ఇలా నాలుగవ సినిమాకి 100 కోట్ల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నట్టు సమాచారం. ఇక ఇందులో ప్రభాస్ కి జోడిగా బాలీవుడ్ నటి త్రిప్తి దిమ్రి హీరోయిన్గా నటించబోతున్నారు సెప్టెంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయి.