బాలాదిత్య ఎలిమినేషన్.. ఇలాంటి వ్యక్తిని చూడలేదంటూ నాగార్జున షాకింగ్ కామెంట్స్…?

షో ఇప్పటివరకు 10 వారాలు పూర్తిచేసుకుంది. ఇక ఈ ఆరవ సీజన్లో ఇప్పటివరకు మొత్తం 10 మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. గత మూడు నాలుగు వారాలుగా బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లుగా ఉన్నవాళ్లే హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తాజాగా పదవ వారంలో బాలాదిత్య హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు. తొమ్మిదవ వారంలో టైటిల్ ఫేవరెట్ గా నిలిచిన గీతు రాయల్ ఎలిమినేట్ అయ్యింది.

బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన దగ్గరినుండి బిగ్ బాస్ రూల్స్ అతిక్రమిస్తూ తనదైన శైలిలో తనుకు నచ్చిన విధంగా గేమ్ ఆడుతూ టైటిల్ దక్కించుకోవడానికి గీతు ప్రతిక్షణం పోరాడింది. ఈ క్రమంలో రిలేషన్స్, ఎమోషన్స్ అని కూడా చూడకుండా ఎదుటివారి వీక్నెస్ తో ఆడుకుంది. ఇలా నెగెటివిటీ మూట కట్టుకొని బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యింది. ఎలిమినేషన్ సమయంలో నాకు ఇక్కడి నుండి వెళ్లాలని లేదు.. నన్ను పంపించకండి అంటూ ఓవర్ డ్రామా చేసింది. ఇలా తన ప్రవర్తనతో గీతు నెగిటివిటీ మూట కట్టుకొని బయటికి వచ్చింది.

ఇక తాజాగా పదవ వారంలో బాలాదిత్య బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేషన్ డిక్లేర్ చేసిన తర్వాత కూడా తాను ఎలిమినేట్ అయిన విషయాన్ని బాలాదిత్య అంతగా పట్టించుకోలేదు. పైగా ఎలిమినేషన్ తర్వాత హౌస్ నుండి బయటకి వస్తున్న సమయంలో కూడా అతను ఏ మాత్రం ఎమోషనల్ అవ్వకుండా చాలా పాజిటివ్ గా హౌస్ నుండి బయటికి వచ్చాడు. ఎలిమినేషన్ సమయంలో బాలాదిత్య చాలా మెట్యూడ్ గా వ్యవహరించాడు. బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో మోస్ట్ మెచ్యూర్డ్ పర్సన్ నువ్వే అంటూ ఆదిత్యను నాగార్జున పొగిడేశాడు. ఇలా మంచి పేరు తో ఆదిత్య హౌస్ నుండి బయటికి వచ్చాడు. ఇక ప్రస్తుతం గీతు కి బాలాదిత్య మద్య ఉన్న వ్యత్యాసం కూడా చాలా క్లియర్ గా కనబడుతోంది.