శ్రీహాన్ తో బ్రేకప్ పై స్పందించిన సిరి… వైరల్ అవుతున్న వీడియో…?

srihan post about siri goes viral on internet

ప్రస్తుతం యువతి యువకులు సోషల్ మీడియా ద్వారా తమలో ఉన్న టాలెంట్ నిరూపించుకుంటూ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటున్నారు. ఇలా ఇప్పటికే ఎంతోమంది సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యి సినిమా ఇండస్ట్రీలో మంచి మంచి అవకాశాలు అందుకుంటున్నారు. యూట్యూబ్ వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ ల ద్వారా ఫేమస్ అయిన శ్రీహన్ కూడా ఇటీవల బిగ్ బాస్ సీజన్ సిక్స్ తెలుగు లో పాల్గొనే అవకాశం దక్కించుకున్నాడు. ఇక బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో శ్రీహన్ ప్రేయసి సిరి కూడా సందడి చేసింది . ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో పాల్గొన్న శ్రీహన్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉంటూ టైటిల్ కోసం పోరాడుతూ కంటెస్టెంట్లకు గట్టి పోటీ ఇస్తున్నాడు.

ఇక బయట ఉన్న సిరి అతని కోసం చాలా కష్టపడుతూ అతన్ని గెలిపించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల సిరి, శ్రీహన్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో సిరి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు షణ్ముఖ్ తో చనువుగా ఉండటం వల్ల సిరి, శ్రీహాన్ మధ్య విభేదాలు ఏర్పడ్డాయని వార్తలు హల్చల్ చేశాయి. ఇక ఇటీవల కూడా ఇటువంటి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల బిగ్ బాస్ బజ్ లో పాల్గొన్న సిరి ఈ విషయాల గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల అయింది. ఈ ప్రోమోలో సిరిని అరియానా గ్లోరి కొన్ని ప్రశ్నలు వేసింది. ఈ క్రమంలో ఒక యూట్యూబ్ ఛానల్ వారి థంబ్ నెయిల్ చూపించి మీ పెళ్లి ఎప్పుడు జరిగింది అంటూ సిరి ని ప్రశ్నించింది. దీంతో సిరి మాట్లాడుతూ.. మా మ్యారేజ్ నిజంగానే వచ్చే సంవత్సరం ఖచ్చితంగా జరుగుతుంది అని సమధానం చెప్పింది. ఆ తర్వాత మరొక యూట్యూబ్ ఛానల్ పెట్టిన తంబ్ నెయిల్ చూపిస్తూ పెళ్లి కాకుండా నువ్వు ఎప్పుడు తల్లివయ్యావు? అని ప్రశ్నించగా.. నేనెప్పుడూ తల్లినయ్యాను అంటూ తన పొట్ట వైపు చూసుకుంది. ఆ తర్వాత సిరి జ్ఞాపకాలను తీసేసిన శ్రీహాన్ అని ఉన్న థంబ్ నెయిల్ చూపిస్తూ.. ఇది నిజమేనా అని ప్రశ్నించింది. దీనికి సిరి స్పందిస్తూ.. మా జీవితంలో చాలా గొడవలు జరిగాయి అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఈ ప్రోమో పూర్తి అయ్యింది. శ్రీహాన్ తో బ్రేకప్ గురించి సిరి ఏం సమాధానం చెప్పిందో తెలియాలంటే ఈ ఎపిసోడ్ చూడాల్సిందే.