నాగర్జున గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ఇనాయ.. వామ్మో ఇలా అనేసిందేంటి..?

దేశంలో నెంబర్ వన్ రియాలిటీ షో గా గుర్తింపు పొందిన బిగ్ బాస్ రియాలిటీ షో గత కొన్ని సంవత్సరాలుగా తెలుగులో కూడా ప్రసారం అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక కొంతకాలం క్రితం బిగ్ బాస్ సీజన్ సిక్స్ తెలుగు కూడా ప్రారంభం అయింది. ఈ సీజన్ సిక్స్ లో మొత్తం 21 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. అయితే ప్రస్తుతం ఈ సీజన్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లోకి కేవలం ఐదు మంది కంటెస్టెంట్లు మాత్రమే ఉన్నారు. వీరిలో రేవంత్, శ్రీహాన్, రోహిత్, కీర్తి, ఆదిరెడ్డి టాప్ ఫైవ్ కంటెస్టెంట్లుగా ఫైనల్ కీ చేరుకున్నారు. ఇక తాజాగా మిడ్ వీక్ ఎలిమినేషన్స్ లో భాగంగా శ్రీ సత్య హౌస్ నుండి బయటకు వచ్చింది.

ఇదిలా ఉండగా ఈ బిగ్ బాస్ సీజన్ సిక్స్ కి మొదటి నుండి ప్రేక్షకు ఆదరణ కరువయ్యింది. దీంతో షో రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి. అందువల్ల బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెంట్ కొనసాగుతున్న వారిని ఎలిమినేట్ చేస్తూ ఈ షో మీ ద ఆసక్తి పెంచేలా బిగ్ బాస్ యాజమాన్యం ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో ఎంతోమంది స్ట్రాంగ్ కంటెస్టెంట్లను బయటకు పంపి బిగ్ బాస్ హౌస్ లో ఉంటూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయలేని కంటెస్టెంట్లను ఫైనల్స్ దాకా తీసుకువచ్చారని ప్రేక్షకులు మండిపడుతున్నారు. ఇక ఇలా బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన కంటెస్టెంట్లలో ఇనాయా కూడా ఒకరు. తన ఆటతో టాప్ ఫైవ్ దాకా చేరుకోవాలని ప్రయత్నం చేసిన ఇనాయా 14వ వారంలో ఎలిమినేట్ అయ్యింది.

ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇనాయ బిగ్ బాస్ యాజమాన్యం గురించి, నాగార్జున గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈనాయా నాగార్జున గురించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఇంటర్వ్యూలో ఇనయా మాట్లాడుతూ..బిగ్ బాస్ ఇప్పటికే విన్నర్ ను ఫైనల్ చేసినట్టుగా వన్ సైడ్ వ్యవహరిస్తోందని తెలియజేసింది. అంతేకాకుండా హౌస్ లో రేవంత్ ఎలా ప్రవర్తించినా కూడా ఎవరు ప్రశ్నించడం లేదని.. మొదటి నుండి రేవంత్ ని వెనకేసుకొస్తున్నట్లు ఇనాయ మండిపడింది. అంతేకాకుండా నాగార్జున గురించి మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన నాగార్జున వచ్చి రావటంతోనే రేవంత్ ని పొగిడే పని పెట్టుకున్నాడని..అదంతా మంచిది కాదని చెప్పుకొచ్చింది.. అంతేకాకుండా ఈ సీజన్లో నాగార్జున హోస్టింగ్ వరస్ట్ గా ఉందని షాకింగ్ కామెంట్స్ చేసింది.