ఈ వారం నామినేషన్స్ లో డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ కార్యక్రమం సీజన్ 6 కొనసాగుతోంది 11 వారాలను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం నుంచి ఇప్పటికే 12 మంది కంటెస్టెంట్లు బయటకు వెళ్లారు. ఇక 12వ వారంలో భాగంగా ఏడు మంది కంటెస్టెంట్ లు నామినేషన్ లో ఉన్నారు.అయితే ఈ కార్యక్రమంలో ఎంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అనుకున్న వారందరినీ కూడా ఎలిమినేట్ చేస్తూ ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ క్రమంలోనే ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయం ఊహకందని విధంగా ఉంది. ఇప్పటికే స్ట్రాంగ్ కటిస్టెంట్లు అందరిని బయటకు పంపించిన బిగ్ బాస్ 12వ వారం ఎలిమినేషన్ పై తీవ్ర ఉత్కంఠత ఏర్పడింది.

ఈ క్రమంలోనే ఈ వారం నామినేషన్ లో ఉన్నటువంటి ఏడు మంది కంటెస్టెంట్లలో డేంజర్ జోన్ లో ఫైమా , ఆదిరెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. అత్యంత తక్కువ ఓట్లతో ఫైమా డేంజర్ జోన్ లో ఉండగా తనకన్నా కొద్ది ఓట్ల తేడాతో ఆదిరెడ్డి తరువాత డేంజర్ జోన్ లో ఉన్నారు. ఇకపోతే ఈవారం డేంజర్ జోన్ లో ఉన్నటువంటి ఫైమాకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉండటం వల్ల తాను ఈవారం నామినేషన్ నుంచి సేఫ్ అయింది.ఇలా ఈమె సేఫ్ కావడంతో తరువాత డేంజర్ పొజిషన్లో ఉన్నటువంటి ఆదిరెడ్డి ఈ వారం బయటకు వెళ్లాల్సిందేనని తెలుస్తుంది.

టాస్కుల విషయంలో ఆదిరెడ్డి ఎంతో కచ్చితంగా టాస్కులను ఆడుతూ తన పెర్ఫార్మెన్స్ చూపిస్తుంటారు. అదేవిధంగా ఈ వారం బిగ్ బాస్ కోచింగ్ సెంటర్ లో భాగంగా తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అందరిని బాగా ఎంటర్టైన్ చేశారు. ఈ విధంగా ఈ వారం ప్రేక్షకులను ఎంతో ఎంటర్టైన్ చేసినప్పటికీ ఆదిరెడ్డి డేంజర్ పొజిషన్లో ఉండడంతో ఈ వారం బయటకు వెళ్లాల్సిందేనని వార్తలు వస్తున్నాయి.ఎంతో అద్భుతమైన ఆట తీరును కనబరుస్తూ ఉన్నటువంటి ఆదిరెడ్డి ఎలిమినేట్ అవుతారని విషయం తెలియగానే అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ తనని ఎలాగైనా సేవ్ చేయాలంటూ పోస్టులు పెడుతున్నారు. మరి ఈ వారం నిజంగానే ఆదిరెడ్డి వెళ్తారా లేకపోతే ఇతర కంటెస్టెంట్లు వెళ్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.