ఒంటిపై బ‌ట్ట‌ల్లేకుండా స‌ర్వం పోగొట్టుకున్న కుర్ర‌బ్యూటీ

అర్జున్ రెడ్డి రీమేక్ ఆదిత్య వ‌ర్మ త‌మిళంలో విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. చియాన్ విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ విక్ర‌మ్ స‌ర‌స‌న ఈ అమ్మ‌డు ఆరంభ‌మే అదిరిపోయే జాక్ పాట్ కొట్టేసింది. చారెడేసి క‌ళ్ల‌తో చ‌క్క‌ని అభిన‌యంతో బానిట అద‌ర‌గొట్టింద‌ని టాక్ వినిపించింది.

అటు బాలీవుడ్ లోనూ వ‌రుణ్ ధావ‌న్ స‌ర‌స‌న అక్టోబ‌ర్ అనే ఎమోష‌న‌ల్ ల‌వ్ స్టోరీలో న‌టించి మెప్పించింది. ప్ర‌స్తుతం విక్కీ కౌశ‌ల్ స‌ర‌స‌న ఓ చిత్రంలో న‌టిస్తోంది. ఇదంతా స‌రే కానీ.. బానిట ఇన్ స్టా.. ట్విట్ట‌ర్ వేదిక‌ల‌పై చెల‌రేగుతున్న తీరు అంత‌కంత‌కు హృట్ పెంచేస్తోంది. తాజాగా బానిట ఫోటోషూట్ ఒక‌టి కంటిపై కునుకుప‌ట్ట‌నివ్వ‌డం లేదంటే న‌మ్మండి.

ఒంటిపై బ‌ట్ట‌లు పోగొట్టుకున్నా..! అంటూ సింపుల్ క్యాప్ష‌న్ ఇచ్చింది. దానికి అభిమానుల నుంచి అంతే అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. కొంద‌రైతే బ‌ట్ట‌లు కొనిచ్చేస్తాం! అంటూ కొంటెగా కామెంట్లు రువ్వారు. మ‌రికొంద‌రు అరెరే ఇలా చేయ‌డం త‌గ‌దు అమ్మ‌డూ అంటూ సూచించారు. బ‌ట్ట‌లు పోతే పోయాయ్.. నూలు పోగు అయినా లేక‌పోతే పోయింది.. కానీ బానిట ఫోటోషూట్ మాత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. నెటిజ‌నుల్లో జోరుగా వైర‌ల్ అయిపోతోంది.