కొత్తగా ఏ బ్యూటీ కనిపిస్తే, ఆ బ్యూటీ మీద కన్నేస్తున్నాడా సీనియర్ హీరో.! వేరేలా కాదు లెండి.. సినిమాల్లో ఆన్ స్క్రీన్ పరంగా మాత్రమే.! సినిమాకి గ్లామర్ అవసరం.! ఆ గ్లామర్ ఎంత ఫ్రెష్‌గా కనిపిస్తే, సినిమాకి అంత ప్లస్ అవుతుందన్న భావన ఈనాటిది కాదు.! ఆ సీనియర్ హీరో ఆలోచన కూడా అదే. వయసు మీద పడుతున్నాగానీ, యంగ్ బ్యూటీస్‌తో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ విషయంలో అస్సలు తగ్గడంలేదు.
కొత్తగా తెరంగేట్రం చేసిన ఓ బ్యూటీ మీద మనసు పారేసుకున్న ఆ సీనియర్ హీరోని, అతనితో సినిమా షురూ చేస్తున్న ఓ దర్శకుడు, ఆ చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ వారిస్తున్నాయట.
‘ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ పండాలంటే.. పెయిర్ బావుండాలి కదా.? తేడా కొడుతోంది జోడీ..’ అని అంటున్నా ఆయనగారు వినడంలేదట. బ్యాక్ టు బ్యాక్ రెండు మూడు సినిమాలు తేడా కొట్టేసినా, ఆ సినిమాల్లో రొమాన్స్ ఫెయిల్ అయినా.. తగ్గేదే లేదంటున్నాడట ఆ సీనియర్ హీరో.