కరోనా నిర్భంధనం ఎన్నో పాఠాల్ని నేర్పించింది. సంపాదించిన దాంట్లో దాచుకోవడం ఎలానో నేర్పించింది. అప్పు కోసం ఎగబడే మనస్తత్వానికి చెక్ పెట్టేసింది. అంతేకాదు.. మెయింటెనెన్స్ పేరుతో భారీగా వదిలించుకునే సెలబ్రిటీ ప్రపంచానికి కరోనా బెస్ట్ లెస్సన్ నేర్పించిందనేది ఇన్ సైడ్ టాక్.
ఇప్పుడు అంతా మారారు. కష్టకాలంలో బతకడమెలాగో నేర్చుకుంటున్నారు. ముఖ్యంగా డబ్బును సేవ్ చేస్తూ లేదా ఎర్నింగ్ స్కిల్ నేర్చుకుంటూ లైఫ్ ని కొత్తగా ప్లాన్ చేస్తున్నారు. అయితే కాస్త అటూ ఇటూగా ఆ హాట్ యంగ్ హీరోయిన్ మాత్రం తెలివైన ప్లాన్ వేసిందట. తన సంపాదన కోసం ఒక సీనియర్ హీరోని సదరు యంగ్ బ్యూటీ వాడేస్తోందట. అతడితో కలిసి ఓ లాభదాయకమైన వ్యాపారాన్ని ఈ లాక్ డౌన్ సమయంలో ప్లాన్ చేసిందట. అది కూడా తాను పెట్టుబడి పెట్టకుండా.. తదుపరి ఆయన సరసన నటించేందుకు కాల్షీట్లు ఇచ్చి అందుకుగాను తనకు అందే పారితోషికాన్ని ముందే అందులో పెట్టుబడిగా పెట్టిందట. ఇంకేం ఉంది.. ఇప్పటికే వ్యాపారం ప్రారంభమైపోయింది.
అయితే ఆ ఇద్దరి గురించి తెలిసిన వారంతా.. షారూక్ ఖాన్ – జూహీచావ్లానా? అంటూ సెటైర్లు వేసేస్తున్నారు. మునుముందు ప్రీతి జింతాలా బుక్కయిపోవడం ఖాయమేనని పంచ్ లు వేస్తున్నారు. మరి ఇప్పటికి ఆ హీరోగారికి ఎసరు పెడుతున్నా.. దీని ఫలితం మునుముందు అనుభవించాల్సి ఉంటుందని కొందరు అలెర్ట్ చేస్తున్నారు సదరు యంగ్ బ్యూటీని. అయినా కానీ ఆవిడ మాత్రం ససేమిరా అనేస్తోందట.