ఆమె ఓ బుల్లితెర నటి.! ఓ ప్రముఖ నిర్మాతకు బాగా దగ్గరైంది. ఈ క్రమంలోనే ఆమెకు సినిమా అవకాశాలూ పెరిగాయి. క్రమంగా బుల్లితెరకు దూరమైందామె. మరీ యంగ్ బ్యూటీ ఏం కాదు.!
ఆ నటితో ఓ రొమాంటిక్ ఫన్ రైడ్ లాంటి సినిమా తెరకెక్కించబోతున్నాడట సదరు యంగ్ ప్రొడ్యూసర్. నేరుగా కాదు లెండి.. స్నేహితుడి పేరు ముందు పెట్టి. కొత్త బ్యానరట.. కానీ, సదరు నిర్మాతగారి బ్యానర్ పేరు కూడా వుండబోతోందిట.
ఈ నిర్మాతకు దగ్గరైన ఆ నటి, అంతకు ముందు వరకూ స్నేహం నడిపిన ఓ కుర్రాడికి హ్యాండిచ్చిందని అంటున్నారు. ఇంతకీ, ఎవరా నటి.? ఏమా కథ.? నిప్పు లేకుండానే పొగ వస్తోందా.? ఏమో, సినిమా అంటేనే ఓ మాయ.! అక్కడ ఇలాంటి మాయ కథలు చాలానే వుంటాయ్.!