ఆ స్టార్ కపుల్ గత రెండేళ్లుగా నిండా ప్రేమలో మునిగి తేల్తున్నారు. ఇటీవల పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారని ప్రచారమైంది. ఈ ఆగస్టు నాటికే పెళ్లాడేయాల్సి ఉండగా.. అందుకోసం ఇరు కుటుంబాలు పెళ్లి భాజాలకు ఏర్పాట్లలో బిజీగా ఉన్నాయని చెప్పుకున్నారు. కానీ ఇంతలోనే కోవిడ్ మహమ్మారీ తరుముకొచ్చి అన్ని ప్లానింగ్సుని దెబ్బ తీసింది.
పనిలో పనిగా ఆ జంట ఇప్పుడే పెళ్లాడితే ప్రమాదాలు ముంచుకొస్తాయంటూ ప్రముఖ జ్యోతిష్కులు హెచ్చరించడంతో ఆ తర్వాత పెళ్లి మ్యాటర్ లో కామ్ అయిపోయారని గుసగుసలు వినిపించాయి. ఏదైతేనేం.. ఈ లాక్ డౌన్ వేళ కావాల్సినంత సమయం చిక్కినా కానీ ఈ జంట పెళ్లికి ఏర్పాట్లు చేయకుండా ఇరువైపులా పెద్దలు టైమ్ వేస్ట్ చేశారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. అనధికారికంగా ఎంత షికార్లు చేసినా అధికారికంగా పెళ్లయ్యాక షికార్లు చేస్తే దాని లెక్కే వేరు. కానీ అందుకు ఆస్కారం లేకుండా పోయింది. ఇక సదరు యంగ్ బ్యూటీ ఆ హీరోతో షికార్లు చేస్తుంటే ఇంట్లో వాళ్లు కొన్ని కండీషన్స్ అప్లయ్ అనేయడంతో పాపం విరహంతో వీగిపోతున్నారట.
పెళ్లి మ్యాటర్ లో క్లారిటీ రాకపోతే కెరీర్ పరంగా కూడా చాలా చిక్కుల్ని ఎదుర్కోవాల్సి వస్తోందిట. సదరు యంగ్ బ్యూటీ ఇప్పటికే అటు ముంబై పరిశ్రమతో పాటు తెలుగులోనూ పలు చిత్రాలకు కమిటవుతోంది. ఆ క్రమంలోనే ఇవన్నీ ఓకే అయితే పెళ్లికి మళ్లీ గ్యాప్ దొరకదని భావిస్తున్నారు. మరి ఈ ప్రేమ గువ్వలు పెళ్లాడేదెపుడో.. విరహానికి చెక్ పెట్టేసేదెపుడో తెలీక బుర్ర పీక్కుంటున్నారు.