Manchu Vishnu: కన్నప్ప సినిమా బిజినెస్ గురించి అలాంటి కామెంట్ చేసిన విష్ణు.. వారి దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా వద్దంటూ!

Manchu Vishnu: టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటించిన లేటెస్ట్ సినిమా కన్నప్ప. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా జూన్ 27వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో పాన్ ఇండియా అలాగే స్టార్ సెలబ్రిటీలు నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా కోసం ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు అభిమానులు. దానికి తోడు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి.

ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగానే హీరో మంచు విష్ణు వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ బిజీబిజీగా ఉన్నారు. అందులో భాగంగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా హీరో మంచు విష్ణు మాట్లాడుతూ కన్నప్ప మూవీ బిజినెస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మంచు విష్ణు మాట్లాడుతూ.. కన్నప్ప సినిమాకు 200 కోట్ల లోపు బడ్జెట్ అయింది. ఈ సినిమా నా సొంత డబ్బు, బ్యాంక్ అప్పులు, లోన్స్ తోనే చేశాను. యూనివర్సిటీ డబ్బులు ఏమి వాడలేదు. అది ట్రస్ట్ కింద ఉంది. వాడితే నన్ను జైలులో వేస్తారు.

ఒక బాంబే కంపెనీ దగ్గరికి వాళ్ళు పిలిస్తే మాట్లాడటానికి వెళ్ళాను నార్త్ థియేట్రికల్ రిలీజ్ కోసం. వాళ్ళు మేము అడ్వాన్స్ లు ఇవ్వము అని చెప్పారు. నేను నిన్ను, నీ కంపెనీ నమ్ముకొని సినిమా తీయలేదు. నా ఆస్తులు, నా క్రెడిబిలిటీ తాకట్టు పెట్టుకొని సినిమా తీస్తున్నాను. మీరొచ్చి నన్ను కాపాడతారని నేను సినిమా తీయలేదు. మీరు డిస్ట్రిబ్యూట్ చేయకపోయినా పర్లేదు. మీ డబ్బు కోసం నేను వచ్చానంటే మీ దగ్గర్నుంచి ఒక్క రూపాయి కూడా నాకు వద్దు అని చెప్పాను. ఆ తర్వాత వాళ్ళ సీఈఓ నుంచి వచ్చి సారి చెప్పి వెళ్లారు. కానీ నేను అక్కడ్నుంచి వచ్చేసాను. ఈ సందర్భంగా మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే మంచు విష్ణు మాటలను బట్టి చూస్తే ఈ సినిమా మంచి సక్సెస్ సాధిస్తుంది అని అనిపిస్తుంది. మరి ఈ సినిమా విడుదల అయ్యి ఎటువంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి..