‎Bollywood: పాపం హీరోయిన్.. రూ.60 కోట్ల మోసం.. దెబ్బకు రెస్టారెంట్ క్లోజ్!

‎Bollywood: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్న చాలామంది హీరో,హీరోయిన్ లు ఒకవైపు ఇండస్ట్రీలో రాణిస్తూనే మరోవైపు బిజినెస్ రంగంలో కూడా రాణిస్తున్నారు. అలా సినిమా రంగంలో, బిజినెస్ రంగంలో రాణిస్తూ కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. అలా బిజినెస్ రంగంలో రాణిస్తున్న వారిలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూడా ఒకరు. ఆమెసినిమా ఇండస్ట్రీలోనే తోపు హీరోయిన్. అందంతో పాటు టాలెంట్ కూడా ఉంది. ముఖ్యంగా ఆమె అందానికి యూత్ లో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఆమె దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది ఈ వయ్యారి భామ.

‎18 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌ గా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. హిందీలో వరుస ఆఫర్స్ అందుకుంది. కానీ కెరీర్ తొలినాళ్లల్లో ఎన్నో విమర్శలు వచ్చాయి. అందంగా లేదని కలర్ తక్కువ ఉందంటూ ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొంది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఆమెను చాలా సినిమాల నుంచి తొలగించారు. అయినా ఆమె ఎక్కడా నిరాశ పడలేదు. ఎక్కడైతే ఆఫర్స్ కోల్పోయిందో అక్కడే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే వివాదాలతో నిత్యం వార్తలలో నిలిచింది. కట్ చేస్తే రూ.2800 కోట్ల ఆస్తులు ఉన్న ఒక వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. ‎ఇప్పుడు ఆమె భర్త వివాదంలో చిక్కుకోవడంతో ఈ అమ్మడు కూడా నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఇప్పటికే ఆమె బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి.

1993 లో బాజీగర్ సినిమాతో హిందీ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది శిల్పా శెట్టి. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ. కాగా హిందీలో చాలా చిత్రాల్లో నటించినప్పటికీ శిల్పా శెట్టికి అనుకున్నంత స్టార్ డమ్ మాత్రం రాలేదు. హిందీలోనే కాకుండా తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించింది శిల్పా శెట్టి. విక్టరీ వెంకటేశ్ సరసన సాహస వీరుడు సాగర కన్య చిత్రంలో కూడా నటించింది. అయితే శిల్పా శెట్టి వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వేలకోట్ల ఆస్తి ఉన్న రాజ్ కుంద్రా పై ఇటీవల రూ. 60కోట్లు మోసం చేశారని బిజినెస్ మ్యాన్ దీపక్ కొఠారి కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదం ప్రస్తుతం నడుస్తోంది. ఇదిలా ఉంటే శిల్పాకు చెందిన బాస్టియన్ రెస్టారెంట్ మూసేస్తున్నట్టు అనౌన్స్ చేశారట. బాస్టియన్ మాకు ఎన్నో జ్ఞాపకాలను అందించింది. ఇప్పుడు ఆ రెస్టారెంట్ మూసేస్తున్నట్టు ప్రకటించారు. మరో కొత్త అనుభవాలతో త్వరలోనే మీ ముందుకు వస్తాం అని అనౌన్స్ చేశారు. వివాదాల కారణంగా రెస్టారెంట్ మూసేస్తున్నారు అని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తున్నాయి.