నయనతార లుక్ తో “గాడ్ ఫాదర్” పై అధికారిక క్లారిటీ ఇచ్చేసిన యూనిట్..!

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి రాబోతున్న పలు భారీ మల్టీ స్టారర్ చిత్రాల్లో దిగ్గజ హీరో మెగాస్టార్ చిరంజీవి అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడ కీలక ఆ పాత్రలో నటిస్తున్న భారీ చిత్రమే “గాడ్ ఫాదర్”. దర్శకుడు జయం మోహన్ రాజా తెరకెక్కించిన ఈ సినిమా మంచి అంచనాలు సెట్ చేసుకొని రిలీజ్ కి కూడా రెడీ అయ్యింది.

అయితే ఇప్పుడు ఈ సినిమా కూడా వాయిదా పడినట్టుగా కొన్ని ఊహాగానాలు స్టార్ట్ కాగా దానిపై నిన్ననే మేకర్స్ అధికారికంగానే ఓ అప్డేట్ అందించినా ఈరోజు అయితే ఓ అధికారిక పోస్టర్ తో సినిమా రిలీజ్ డేట్ ప క్లారిటీ ఇచ్చేసారు.

ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈమెని పరిచయం చేస్తూనే ఒక క్లాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని అయితే చిత్ర యూనిట్ ఇప్పుడు రిలీజ్ చేసారు. మరి ఇదిలా ఉండగా ఈ పోస్టర్ లో నయనతార ఏదో బాధలో ఉన్నట్టు కనిపిస్తుండగా.. 

ఈ పోస్టర్ లోనే సినిమా రిలీజ్ డేట్ కూడా అక్టోబర్ 5 అన్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. దీనితో గాడ్ ఫాదర్ పై అఫీషియల్ పోస్టర్ తో కన్ఫర్మ్ చేసారు. అంటే ఈ సినిమా రిలీజ్ పరంగా వచ్చిన రూమర్స్ కి చెక్ పడినట్టే అని చెప్పాలి.