విగ్నేష్ ని పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేది.. భర్త గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన నయనతార!

లేడీ సూపర్ స్టార్ నయనతార ధనుష్ తో జరిగిన గొడవల మూలంగా ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసింది. ఎక్కడ చూసినా వారిద్దరి వివాదం గురించిన సమాచారమే. ప్రస్తుతం ఇటీవల ఈ తార ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భర్త విగ్నేష్ ని పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేది అంటూ ఇచ్చిన స్టేట్మెంట్ తో ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతుంది. అసలు ఆమె ఏం చెప్పింది, భర్త గురించి ఎందుకలా మాట్లాడిందో ఒకసారి చూద్దాం.

ఆ ఇంటర్వ్యూలో తమ వైవాహిక జీవితాన్ని గురించి మాట్లాడిన నయనతార తామిద్దరం జీవితాన్ని కలిసి పంచుకోకపోయి ఉంటే బాగుండేది అని కొన్నిసార్లు అనిపిస్తుంది, అతనిని ఈ బంధంలోకి లాగినందుకు అప్పుడప్పుడు గిల్టీగా అనిపిస్తుంది. విగ్నేష్ మంచి మనసున్న వ్యక్తి నేను కూడా మంచిదాన్నే కానీ తనంత మంచితనం అయితే నాలో లేదనుకుంటున్నాను, మా రిలేషన్ లో మొదటి అడుగు నేనే వేశాను. నేనే కనుక అతని జీవితంలో లేకపోయి ఉంటే డైరెక్టర్గా, రచయితగా, గేయ రచయితగా అందరూ అతనిని గుర్తించేవారు.

కెరియర్ పరంగా నేను విగ్నేష్ కన్నా సీనియర్ ని, అతను నా కన్నా ఆలస్యంగా కెరియర్ ని ప్రారంభించాడు. నేను ఆల్రెడీ సక్సెస్ అయిపోయి నాకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాను కానీ ఇంకా అతడు తన స్థానం సంపాదించుకునే పనిలోనే ఉన్నాడు. అతను వరుస బ్లాక్బస్టర్స్ ఇవ్వలేదని, తన సినిమాలు ఆలస్యంగా వస్తున్నాయని అతనిని ట్రోల్ చేస్తున్నారు, చులకన గా చూస్తున్నారు. వారు ఎదుర్కొనే ద్వేషం కొన్నిసార్లు వారు పంచుకునే ప్రేమ మరియు గౌరవాన్ని కప్పి వేస్తుందని చెప్పుకొచ్చింది నయనతార.

ఎవరైనా విజయవంతమైతే సమానంగా విజయం సాధించిన వారిని లేదంటే మనకంట పై స్థాయిలో ఉన్న వారిని ప్రేమించాలని అనుకుంటాము అయితే మీరు డబ్బు మరియు లగ్జరీని ఎంచుకోవడం కాదు ప్రేమని ఎంచుకోండి అప్పుడు ఎదుటి మనిషితో మరింత ప్రేమలో పడతారు.. నిజానికి విగ్నేష్ చాలా తెలివైనవాడు 18 సంవత్సరాలకే కెరియర్ ప్రారంభించి 21 సంవత్సరాలు వయసుకే దర్శకుడు అయ్యాడు అంటూ భర్తని వెనకేసుకొచ్చింది ఈ లేడీస్ సూపర్ స్టార్.