Nayantara: ఎలాంటి ఉల్లంఘన జరగలేదు : నయన తరుఫున లాయర్‌

Nayantara : ‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ అనే డాక్యుమెంటరీ విషయంలో లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార , తమిళ స్టార్‌ నటుడు ధనుష్‌ మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. నయన్‌ డాక్యుమెంటరీలో పర్మిషన్‌ లేకుండా ‘నేనూ రౌడీనే’ మూవీలోని మూడు సెకండ్ల క్లిప్పింగ్‌ను వాడుకున్నారంటూ ధనుష్‌.. నయన్‌ దంపతులపై మద్రాసు హైకోర్టులో రెండు రోజుల క్రితం దావా వేశారు. దీనిపై నయన్‌ తరఫు లాయర్‌ తాజాగా స్పందించారు.

డాక్యుమెంటరీలో ఎలాంటి కాపీరైట్‌ ఉల్లంఘనా జరగలేదని స్పష్టం చేశారు. డాక్యుమెంటరీలో వినియోగించిన విజువల్స్‌ సినిమాలోనివి కావని తెలిపారు. అవి బీటీఎస్‌కు సంబంధించినవని స్పష్టం చేశారు. అది వ్యక్తిగత లైబ్రరీలో భాగం అని తెలిపారు. కాబట్టి అది ఉల్లంఘన కిందకు రాదని ఓ ఆంగ్ల మీడియాతో అన్నారు.

మరోవైపు ఈ కేసుకు సంబంధించి మద్రాసు హైకోర్టులో తదుపరి విచారణ డిసెంబర్‌ 2న (సోమవారం) జరగనుంది. కాగా, నయన్‌.. ధనుష్‌ మధ్య గతకొంత కాలంగా వార్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. నయనతార పెళ్లితో పాటు ఆమె జర్నీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ ‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ అనే డాక్యుమెంటరీని రూపొందించింది. ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది.

అయితే, ఈ డాక్యుమెంటరీలో ధనుష్‌ నిర్మాతగా వ్యవహరించిన ‘నేనూ రౌడీనే’ మూవీ షూటింగ్‌ క్లిప్పింగ్స్‌ని వాడుకున్నారు. ఆ క్లిప్పింగ్‌ను డాక్యుమెంటరీలో వాడుకునేందుకు అనుమతి లేకపోవడంతో రూ.10కోట్ల పరిహారం ఇవ్వాలని ధనుష్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు నయనతారకు లీగల్‌ నోటీసులు కూడా పంపారు. ఈ క్రమంలోనే ధనుష్‌ని లక్ష్యంగా చేసుకొని నయనతార ఓ బహిరంగ లేఖను విడుదల చేసింది. చట్టపరంగా తేల్చుకుంటానని తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఈ వ్యవహారం తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ధనుష్‌ కోర్టును ఆశ్రయించడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

సీజ్ ద షిప్ అన్నా మాటపై. | Balakotaiah About Pawan Kalyan | Sieze The Ship | Kakinada | TeluguRajyam