పెనిమిటి అంటే భర్త. సునీల్ మగ కదా . మరి అతనికి పెనిమిటి ఏమిటి ? అనుకుంటున్నారు కదూ? ఒకప్పుడు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, కమెడియన్ సునీల్ రూమ్ మేట్స్. . హైదరాబాద్ పంజాగుట్టలో ఓ రూమ్ లో ఉండి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న రోజులవి . త్రివిక్రంలో వున్న ప్రతిభను సునీల్ గ్రహించి ప్రోత్సహించసాగాడు . అలాగే సునీల్ డైలాగ్ చెప్పే పద్దతి , హావా భావాలు , ఆ టైమింగ్ త్రివిక్రంకు నచ్చాయి ఎప్పటికైనా నువ్వు మంచి ఆర్టిస్ట్ వు అవుతావని భారోసా ఇచ్చేవాడు .

ఈ నేపధ్యలో సునీల్ ఇంటికి సంబందించిన అన్ని పనులు చేసేవాడు , ఇల్లు తుడవడం ,వంట చేయడం , గిన్నెలు కడగడం వంటి పనులు. త్రివిక్రంను మాత్రం ఈ పనులు చేయించేవాడు కాదట. ఒక సారి త్రివిక్రమ్ చెన్నై వెళ్ళాడట డైలాగులు రాయడానికి , అయితే త్రివిక్రమ్ కు తమిళ్ రాదు, చేతులో డబ్బులు ఉన్నాయో ,లేదో , ఎలాంటి అవస్థలు పడుతున్నాడో అని హైద్రాబాద్లో వున్నా సునీల్ తెగ బాధపడేవాడట .
” నిద్దర్నీ ఇరిచేసి రెప్పల్ని తెరిచాను
నువ్వొచ్చే దారుల్లో చూపుల్ని పరిచాను
ఒంటెద్దు బండెక్కిరారా సగిలేటి
దొండల్లో పదిలంగా రారా సగిలేటి “
అని భర్త గురించి భార్య ఆవేదన అరవింద సమేత వీర రాఘవ సినిమాలో పాట రూపంలో ఉంటుంది . దీనిని గుర్తు చేసి మా ఇద్దరి బంధాన్ని అర్ధం చేసుకోండి అని సునీల్ తనదైన హాస్య ధోరణిలో చెప్పాడు .
