సంగీత నృత్య అకాడెమీకి చైర్మన్ గా వందేమాతరం శ్రీనివాస్

సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు, దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ ను ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడుగారు సంగీత నృత్య అకాడెమీకి చైర్మన్ గా నియమించారు . ఈరోజు ఉత్తర్వులు వెలువడ్డాయి . మూడు దశాబ్దాలుగా సినిమా రంగం శ్రీనివాస్ మమేకమైపోయాడు .
ప్రజానాట్య మండలిలో పనిచేస్తున్న శ్రీనివాస్ ను సినిమా రంగానికి పరిచయం చేసింది మాదాల రంగారావు .
మొదట కాలేజీ కుర్రవాడ అనే పాటను “స్వరాజ్యం “సినిమాలో శ్రీనివాస్ గానం చేశాడు . తరువాత నిర్మాత యలమంచిలి హరికృష్ణ టి .కృష్ణ దర్శకత్వంలో నిర్మించిన “వందేమాతరం “సినిమాలో డాక్టర్ నారాయణ రెడ్డి రచించిన వందేమాతర గీతం వరసమారుతున్నది .. అనే పాటను శ్రీనివాస్ తో పాడించారు . ఆ సినిమా విడుదల తరువాత శ్రీనివాస్ ఆ సినిమా పేరును తన పేరుకు ముందు చేర్చుకున్నాడు .

ఆంధ్ర ప్రదేశ్లో సంగీత, నృత్య కళల కోసం తన వంతు క్రిష్ చేస్తానని వందేమాతరం చెప్పాడు .
తనపై నమ్మకం ఉంచి చైర్మన్ గా నియమించిన ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు గారి మాట నిలబెడతానని శ్రీనివాస్ తెలుగు రాజ్యం తో చెప్పారు .