ఏఆర్ రెహమాన్ కేవలం ఆమె కోసమే ఈయన మతం మారారా?

చిత్ర పరిశ్రమలో ప్రముఖ సంగీత దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకొని పలు భాషలలో సినిమాలకు సంగీతం అందిస్తూ సంగీత దర్శకుడిగా గుర్తింపు పొందిన ఏఆర్ రెహమాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏఆర్ రెహమాన్ తన సంగీతంతో ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధుల్ని చేస్తారు. ఈయన సంగీతం వింటే మనసు కూడా ఎంతో తేలికగా అవుతుంది. ఇలా ఎంతో అద్భుతమైన సంగీతం అందించి ఏకంగా ఆస్కార్ అవార్డును అందుకున్న ఏఆర్ రెహమాన్ అసలు పేరు ఏంటి అతను హిందూ మతం నుంచి ఇస్లాం మతానికి ఎందుకు మారారు అనే విషయం చాలామందికి తెలియదు.

ఇలా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని అందరికీ ఏఆర్ రెహమాన్ గా సుపరిచితమైన ఈయన అసలు పేరు ఏంటి అనే విషయానికి వస్తే.. రెహమాన్ తండ్రి ఆర్.కే శేఖర్ కూడా మంచి పేరున్న మ్యూజిక్ కంపోజర్. ఇక రెహమాన్ కు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ పై ఆసక్తి ఉండడంతో తన నాలుగేళ్ల వయసులోనే తన తండ్రి తనకు ఒక గిటార్ కొనిచ్చారు. వయసులోనే తన తండ్రి మృతి చెందడంతో ఈయన జీవితమే మారిపోయింది.తన తండ్రి మరణంతో జీవితం గడపడమే కష్టంగా మారిపోయింది ఒక చిన్న ఇంట్లో అద్దెకు ఉంటూ ఆయనకున్న వస్తువులను అద్దెకు ఇస్తూ జీవనం సాగించారు.

ఇలా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో రెహమాన్ అక్కకు జబ్బు చేయడంతో కనీసం ఆమెకు వైద్యం చేయించడానికి కూడా తన వద్ద డబ్బులు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారు.అయితే తన సన్నిహితుల సలహా మేరకు తన అక్కకు జబ్బు బాగయితే తాను ఇస్లాం మతం స్వీకరిస్తానని ఒక దర్గాలో మొక్కుకున్నారట. ఇలా ఆ మొక్కు ఫలించి తన అక్క జబ్బు బాగుపడటంతో ఈయన  ఏ.ఎస్.దిలీప్ కుమార్ గా ఉన్న తన పేరును కాస్త ఏఆర్ రెహమాన్ గా మార్చుకున్నారు. అలా తన అక్క కోసం దిలీప్ కుమార్ కాస్త రెహమాన్ అయ్యారు. ఇకపోతే ఈయన మతం మారినప్పటి నుంచి ఆయన జీవితం కూడా మారిపోయింది. ఆయన ఏ పని చేసిన పట్టిందల్లా బంగారం అనేలా అన్ని పనులు సక్సెస్ అవుతూ నేడు దేశం మొత్తం గర్వించే స్థాయికి రెహమాన్ ఎదిగారు.