ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన సంగీతంతో దేశవ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్న ఏ ఆర్ రెహమాన్ ఆస్కార్ అవార్డుతో భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు అందించాడు. ఇలా సంగీత మాంత్రికుడిగా గుర్తింపు పొందింన ఏ ఆర్ రెహమాన్ కి మన దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. తెలుగు, తమిళ్, హిందీ,కన్నడ, ఇంగ్లీష్ వంట్టి అన్ని భాషలలో అద్భుతమైన సంగీతాన్ని అందించిన రెహమాన్ కి అవార్డులు, రివార్డులు వరించాయి.
ఈ గౌరవం కేవలం మన దేశానికే పరిమితం కాలేదు. విదేశాలలో కూడా రెహమాన్ కి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇటీవల కెనెడా లో రెహమాన్ కి అరుదైన గౌరవం దక్కింది. కెనడా దేశంలోని వీధికి ఆయన పేరును నామకరణం చేసారు. ఇటీవల కెనడా దేశంలోని మార్కమ్ అనే పట్టణంలో ఉన్న వీధికి రెహమాన్ పేరును పెట్టారు. అయితే ఈ పట్టణ వీధికి రెహమాన్ పేరు పెట్టడం ఇదే తొలిసారి కాదు. గతంలో 2013లో కూడా ఒక వీధికి రెహమాన్ పేరు పెట్టారు. మరీ ఇప్పుడు తాజాగా మరో వీధికి రెహమాన్‌గా నామకరణం చేసి రెహమాన్ పట్ల వారికి ఉన్న అభిమానాన్ని తెలియచేశారు.
ఈ విషయమై ఏఆర్ రెహమాన్ స్పందించారు. కెనడా దేశంలో ఒక వీధికి తన పేరు పెట్టడం పై రెహమాన్ సంతోషం వ్యక్తం చేసాడు. ఈ క్రమంలో ట్వీట్ చేస్తూ.. ఇలాంటి గౌరవం దక్కుతుందని జీవితంలో ఎప్పుడూ ఊహించలేదని వెల్లడించారు. ఈ సంధర్భంగా మార్కమ్ పట్టణ మేయర్ ఫ్రాంక్ స్కార్పిట్టితో పాటు, ఇండియన్ కాన్సులేట్ జనరల్ అపూర్వ శ్రీవాస్తవకు, అలాగే తనపై అపారమైన అభిమానం పెంచుకున్న కెనడా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కెనడా ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని రెహమాన్ కోరుకున్నారు. సంగీతంలో రంగంలో తనకు మద్ధతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తూ.. వందల ఏళ్ల చరిత్ర ఉన్న సినీ సంద్రంలో తను ఒక చిన్న నీటి బొట్టునని రెహమాన్ పేర్కొన్నారు. ట్విట్టర్ లో రెహమాన్ షేర్ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ గా మారింది. రెహమాన్ కి ఈ అరుదైన గౌరవం లభించటంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.