Sridevi: టాలీవుడ్ హీరో నాచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా కోర్ట్. ఈ సినిమాను ఫోక్సో చట్టం నేపథ్యంలో తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా యువతకు బాగా కరెక్ట్ అయిందని చెప్పాలి. చట్టాల గురించి సరైన అవగాహన లేకుండా యువత చేస్తున్న చిన్న చిన్న తప్పుల గురించి ఈ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. నాని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌లో ప్రశాంతి తిపిర్నేనితో కలిసి నిర్మించారు.
ప్రియదర్శి పులికొండ, హర్ష్ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన హర్ష్ రోషన్ చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు. ఇక కోర్ట్ సినిమాలోనూ తన నటనతో ఆకట్టుకున్నాడు రోషన్. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించిన శ్రీదేవి కూడా తన నటనతో పేక్షకులను కట్టిపడేసింది. చిన్న వయసులోనే మొదటి సినిమా అయినప్పటికీ నటించి యువతను బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం శ్రీదేవి ఇంటర్ సెకండియర్ చదువుతోంది.
ఇకపోతే కోర్ట్ సినిమా తర్వాత ఆ మూవీ మంచి విజయం సాధించడంతో శ్రీదేవి చాలా షోలకు, గేమ్ షోలలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఈ నేపథ్యంలోనే ఒక సందర్భంలో భాగంగా ఆమె మాట్లాడుతూ తనకు వచ్చిన బాలీవుడ్ ఆఫర్ గురించి చెప్పకొచ్చింది. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ.. ఒక బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ నాకు ఆఫర్ ఇచ్చాడు. ఆ డైరెక్టర్ నాకు ఒక పాట పాడాలని చెప్పాడు. ఒక కవర్ సాంగ్ నాతో కలిసి పాడాలి. అందుకోసం నన్ను ముంబైకి రావాలి అని చెప్పడంతో నేను భయపడ్డాను. షూట్ కోసం ముంబై రావాలి అని చెప్పడంతో నేను భయపడిపోయాను. కానీ నేను వెళ్ళలేదు అని చెప్పుకొచ్చింది శ్రీదేవి. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కోర్టు మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవికి ముందు ముందు మంచి సినిమా అవకాశాలు వస్తాయేమో చూడాలి మరి.