విలన్ గా మారిన సంగీత దర్శకుడు

రచయితలూ, దర్శకులు, సంగీత దర్శకులు నటులుగా మారడం కొత్తేమి కాదు. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు నటుడిగా తన లక్ ట్రై చెయ్యబోతున్నాడు. ఇప్పటికే సంగీత దర్శకుడు రఘు కుంచె నటుడిగా బిజీ గా మారిపోయాడు.

రఘు లాగే ఇప్పుడు ఒకప్పటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి నటుడిగా మారనున్నాడు. తాజాగా  ఆయన విలన్ లుక్ లో ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేశారు టీమ్. ఈ సినిమాలో కోటి విలన్‌గా కనిపించబోతున్నాడు. దీపికా, ఆరాధ్య జంటగా  రవిశ్రీ దుర్గాప్రసాద్‌ దర్శకత్వం రూపొందుతున్న సినిమా ‘పగ పగ పగ’. ఈ సినిమాలో కోటీ ఓ వైవిధ్యమైన పాత్రను పోషిస్తున్నాడు.

కోటి పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఇటీవల దర్శకుడు మోహర్‌ రమేష్‌ విడుదల చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈసినిమాను త్వరలోనే రిలీజ్ చేస్తామంటున్నారు టీమ్. ఈ సినిమాలో విలన్ గా నటించడంతో పాటు..మూవీకి సంగీతం కూడా కోటీనే అందించారు.

ఈ సినిమాలో బెనర్జీ, జీవీకే నాయుడు, కరాటే కళ్యాణి, భరణి శంకర్, రాయల్ హరిశ్చంద్ర, సంపత్, జబర్దస్త్ వాసు లాంటి వారు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.