హీరోయిన్ అకౌంట్స్ నుండి ఫొటోస్, వీడియోస్ మాయం. హ్యాకింగ్??

శ్రద్ధా కపూర్ ట్విట్టర్ అకౌంట్, ఇంస్టాగ్రామ్ నుండి ఫోటోలు, వీడియోలు మాయమయ్యాయి. అలా ఎలా అవుతుంది? ఎవరైనా హ్యాక్ చేశారేమో అని డౌట్ వస్తుంది కదూ… కానీ ఎవరు హ్యాక్ చేయలేదు. ఆమె సోషల్ మీడియా ఖాతాలన్నీ భద్రంగా ఉన్నాయి. మరి ఇంకెవరు చేస్తారు అని అనుమానమా? ఎవరో కాదు స్వయంగా శ్రద్ధా కపూర్ ఈ పని చేసింది. ఆమె నటించిన హారర్ మూవీ ‘స్త్రీ’ ప్రమోషన్ కోసం ఇలా చేసింది.

ఈ విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ నుండి ధ్రువీకరించుకోవచ్చు. తన వాల్ పైన ‘మర్ద్, కో దర్ద్, హోగా’ అని వరుసగా మూడు పిక్స్ కనిపిస్తున్నాయి. ఇవి మూడు కలిపి ‘స్త్రీ’ సినిమా ట్యాగ్ లైన్. ఈ సినిమా హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. రాజ్ కుమార్ రావు కో స్టార్ గా నటిస్తున్నారు. శ్రద్ధా కపూర్ చేసిన ఈ చర్య ఒకింత ఆశ్చర్యానికి గురి చేసేదిలా ఉన్నా తన మార్కెటింగ్ స్ట్రాటజీని అందరమెచ్చుకుంటున్నారు.