నిజమే అయితే దేవరకొండది కరెక్ట్ డెసిషనే

గీత గోవిందం, ట్యాక్సీవాలా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవటంతో …ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ముఖ్యంగా అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాల‌తో నైజాం లో కలెక్షన్ కింగ్ గా ఎదిగి సంచ‌ల‌నాలు సృష్టించాడు. ఈ నేపధ్యంలో ట్యాక్సీవాలా త‌ర్వాత దేవరకొండ న‌టిస్తున్న తాజా చిత్రం `డియ‌ర్ కామ్రేడ్` రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ పూర్త‌ైన ఈ చిత్రంపోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి ఫైనల్ కాపీని హీరో దేవ‌ర‌కొండ‌కు చూపించార‌ట‌.

అయితే ఫైన‌ల్ కాపీ చూశాక విజ‌య్ రిలీజ్ కి అభ్యంత‌రం చెప్పార‌ని తెలుస్తోంది. కొన్ని సీన్స్ విష‌యంలో రీషూట్లు అవ‌స‌రం అని తేల్చి చెప్పారని తెలుస్తోంది. ఈ విష‌య‌మై మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మాత‌ల్ని తానే రిక్వెస్ట్ చేసి, రీషూట్ లకు ఒప్పించాడని చెప్తున్నారు. వాళ్లు కూడా సరైన హిట్ లేక గత కొద్ది కాలంగా ఇబ్బందులు పడుతూండటంతో రిస్క్ చేయద్దని రీషూట్సే ముద్దని ..గో ఎ హెడ్ అన్నారట.

నిజానికి ఈ చిత్రాన్ని మే నెలాఖ‌రున‌ రిలీజ్ చేయాల‌ని భావించారు. ప్ర‌స్తుత ఉన్న పరిస్దితి చూస్తుంటే రీషూట్ల‌కు ఇంకాస్త స‌మ‌యం ప‌డుతుంది. అంటే రిలీజ్ తేదీ ఇప్పుడే ప్ర‌క‌టించ‌లేని స‌న్నివేశం ఉంద‌నే అర్థం అవుతోంది. ఈ చిత్రంలో దేవ‌ర‌కొండ కాకినాడ బోయ్ గా.. కాలేజ్ విద్యార్థిగా క‌నిపించ‌బోతున్నాడు.

క‌మ్యూనిజం భావాలున్న విద్యార్థిగా అత‌డు క‌నిపిస్తాడు. ర‌ష్మిక మంద‌న తెలంగాణ గాళ్ గా.. క్రికెట‌ర్ గా న‌టించింది. గీత గోవిందం స‌క్సెస్ త‌ర్వాత ఈ జోడీ తిరిగి రిపీట‌వ్వ‌డం ఫ్యాన్స్ కి బ్యూటిఫుల్ ట్రీట్ అనే చెప్పాలి. మొద‌ట సినిమాకు వేస‌వి రిలీజ్ చేద్దామ‌ని ప్లాన్ చేసుకున్నారు కానీ, రీషూట్ కార‌ణంగా విడుద‌ల‌ను ద‌స‌రాకు వాయిదా వేసుకున్నారు చిత్ర‌యూనిట్. ఈమూవీని మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్ధ వారు నిర్మిస్తున్నారు.