రామ్ చరణ్, ఎన్టీఆర్ కోసం రవితేజని లాగేసారు

కొన్ని వార్తలు వింటూంటే అసలు వాటికి అర్దం ఉందా అనిపిస్తుంది. అయితే పెద్ద సినిమా గురించి ఏదో ఒకటి రాయాలనే ఉద్దేశ్యంతో ఏదో ఒకటి వండి వడ్డించేస్తూంటారు కంటెంట్ రైటర్స్. తాజాగా ఇలాంటి వార్త ఒకటి అభిమానులను ఆశ్చర్యపరిచింది. కాస్సేపు నిజమేనేమో అనిపించింది.

ఆ వార్త మరేదో కాదు…ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న చిత్రంలో రవితేజ విలన్ గా కనిపించనున్నారని. గతంలో రాజమౌళి దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన విక్రమార్కుడు పెద్ద హిట్. దాంతో రాజమౌళి దర్శకత్వంలో మళ్లీ రవితేజ కనిపిస్తే బాగుండును అని ఆయన అభిమానులుకు ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునో ఏమో కానీ ఈ వార్త బయిటకు వదిలారు.

రవితేజ పేరులో మొదటి అక్షరం కూడా ఆర్ కాబట్టి…#RRR కు న్యాయం చేకూర్చినట్లు ఉంటుందని ఆలోచించారు. అయితే అలాంటి ఆలోచన ఏదీ రాజమౌళి టీమ్ చేయటం లేదని సమాచారం. ఇప్పటివరకూ ఈ సినిమాలో విలన్ ఎవరనేది మాత్రం తేలలేదు. కానీ నిజంగా రవితేజను పెడితే మాత్రం ఆ కిక్కే వేరు.

ఇక ఈ సినిమాలో కీలకమైన ఇంటర్వెల్‌ సీన్‌ను రాజమౌళి భారీగా డిజైన్‌ చేస్తున్నాడట. ఈ ఒక్క సీన్‌నే దాదాపు 45 రోజుల పాటు తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టుగా బయిట ప్రచారం మొదలైంది. ఈ ఇంట్రవెల్ ఎడిసోడ్‌లో కళ్లు చెదిరే ఫైట్‌ సీక్వెన్స్‌ ఉంటుంటున్నారు. అయితే రాజమౌళి సినిమాల్లో ఎప్పుడూ అలాగే జరుగుతుంది కాబట్టి వింతైతే ఏమీ లేదు. నిజంగానే ఇంట్రవెల్ ఫైట్ ఉండే అవకాసం ఉంది. అలాగేఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ అలరించనున్నారట. వారిలో ఒకరు విదేశీ హీరోయిన్‌ అన్న ప్రచారం కూడా జరుగుతోంది.