OTT అంతు చూడ‌నిదే వ‌దిలేట్టు లేడు!

                                   రానాలో సిస‌లైన బిజినెస్ క్వాలిటీస్

లాక్ డౌన్ కరోనావైరస్ భయం బిజినెస్ మేన్ ల‌ను నిల‌వ‌నీయ‌డం లేదు. దేశంలోని అన్ని ఇతర చిత్ర పరిశ్రమల మాదిరిగానే టాలీవుడ్ కూడా బంద్ అయిపోయింది. ఈ కఠినమైన కాలంలో చాలా మంది చిత్రనిర్మాతలు .. న‌టీనటులు.. టెక్నీషియ‌న్లు 4 నెలలకు పైగా నిరుద్యోగులుగా ఉన్నారు.

అయితే, నటుడు-నిర్మాత రానా దగ్గుబాటి తన వ్యక్తిగత, వృత్తి జీవితంలో తన ప‌నుల‌న్నిటినీ పూర్తి చేసుకుంటున్నారు. అతను ఓవైపు మిహీకా బజాజ్‌తో తన వివాహం కోసం సన్నద్ధమవుతున్నా.. మ‌రోవైపు ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్‌ల కోసం కంటెంట్‌ను డెవ‌ల‌ప్ చేసేందుకు ఏకకాలంలో కృషి చేస్తున్నారు.

రానా ఇప్ప‌టికే అంతర్జాతీయంగా పాపుల‌రైన ఓటీటీ సిరీస్ ల‌ను చేజిక్కించుకున్నాడు. వాటి ఇండియా రిలీజ్ హక్కులను సొంతం చేసుకున్నాడు. అతను ఇప్పటికే అమెజాన్ ప్రైమ్,  నెట్‌ఫ్లిక్స్‌తో చర్చలు జరుపుతున్నాడు. త్వరలో కొత్త ఒరిజినల్ సిరీస్‌కు సంబంధించి అధికారిక ప్రకటన రిలీజ్ చేయ‌నున్నాడ‌ట‌. రానా న‌టిస్తున్న పాన్ ఇండియా సినిమాల షూటింగుల‌కు ప్ర‌స్తుతం బ్రేక్ ప‌డిన సంగ‌తి తెలిసిందే. మ‌హ‌మ్మారీ శాంతించాక వాటి షూటింగుల్ని ఫినిష్ చేస్తారు. అలాగే హిర‌ణ్య‌క‌శిప‌ను ప్రారంభిస్తారు.