రామ్‌చరణ్ మీసంలో రోషం చూపించే ప్రయత్నం!

Ram Charan

మీసంలో రోషం చూపించే ప్రయత్నం!

 
క్రేజీ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తోన్న సోషియో ఫిక్షన్ ‘ఆర్ఆర్ఆర్’లో రామ్‌చరణ్ ‘రామరాజు’ పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి రామ్‌చరణ్ లేటెస్ట్ లుక్ ఇటీవల వెలుగు చూసింది.  ఈ లేటెస్ట్ లుక్ లో  మీసంలో రోషం చూపించే ప్రయత్నం చేశాడు రామ్‌చరణ్.  ఇదంతా అల్లూరి సీతారామరాజు పాత్ర కోసం.  ఆ పాత్ర కోసం చరణ్  మీసాన్ని ఇలా మెలితిప్పాడు.
 
జక్కన్న ఇప్పటి వరకూ చెప్పిన కథ ప్రకారం సినిమాలో స్వాతంత్య్ర పోరాటానికి మునుపు రామరాజు కథను చెప్పనున్నట్టు చెప్పకనే చెప్పాడు. మరి అప్పటికి రామరాజు మీసాలు ఇలాగే మెలితిరిగి ఉన్నాయా? అన్న ప్రశ్నకు సమాధానం దొరక్కపోవచ్చు. కానీ, ఆంధ్ర గిరిజన ప్రాంతం నుంచి పుట్టుకొచ్చిన విప్లవాగ్నిగా రాజవౌళి చూపించనున్న రామరాజుకు మీసాలు ఇలానే ఉంటాయన్న విషయం చరణ్‌ను చూసి తెలుసుకోవచ్చు.  ప్రస్తుతం ఇండస్ట్రీలో  ‘ఆర్ఆర్ఆర్’దే  హాట్ హాట్ గా వినిపిస్తున్న టాక్.