Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరస పాన్ ఇండియా సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన బుచ్చిబాబు డైరెక్షన్లో పెద్ది అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఈ సినిమా తర్వాత మరో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ సుకుమా డైరెక్షన్లో ఇంకో సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. ఇలా వరుస సినిమాలతో రామ్ చరణ్ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇదిలా ఉండగా తాజాగా రాంచరణ్ కి సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. రామ్ చరణ్ నిధి వరకు ఎన్టీఆర్ తో కలిసి RRR సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో మల్టీ స్టారర్ సినిమాకు కూడా ఈయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది. కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో ధనుష్ ఒకరు. ఈయన హీరోగా మాత్రమే కాకుండా దర్శకుడిగా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఒక అదిరిపోయే మాస్ సినిమా లైన్ రామ్ చరణ్ కు చెప్పడంతో రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో చేయటానికి సానుకూలంగానే ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా ధనుష్ చరణ్ కాంబోలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంతేకాకుండా ఈ సినిమాకు డైరెక్టర్గా ధనుష్ వ్యవహరించబోతున్నారు అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది.
ఇలా వీరిద్దరి కాంబినేషన్లో మల్టీ స్టారర్ సినిమా రాబోతుంది అంటూ వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది. ఇదే కనుక నిజమైతే థియేటర్లు బద్దలవ్వాల్సిందే అంటూ అభిమానులు భావిస్తున్నారు.