Ramcharan: రామ్ చరణ్ పై మోజుపడి పెళ్లి చేసుకోవాలనుకున్న టాలీవుడ్ హీరోయిన్?

Ramcharan: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు రామ్ చరణ్ ఒకరు. చిరంజీవి వారసుడుగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ ఈయన తనకంటూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఇక రాంచరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

ఇక ప్రస్తుతం రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇందులో రామ్ చరణ్ కి జోడిగా శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే నేడు రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే చరణ్ కి సంబంధించి ఎన్నో విషయాలు బయటకు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే చరణ్ అంటే గతంలో ఓ టాలీవుడ్ హీరోయిన్ ఎంతగానో ఇష్టపడ్డారట ఏకంగా ఆయనను పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి కూడా వచ్చారని తెలుస్తుంది. కానీ అప్పటికే ఉపాసనతో రామ్ చరణ్ ప్రేమలో ఉన్నారనే విషయం తెలుసుకొని ఆమె వెనకడుగు వేసినట్టు సమాచారం. మరి రామ్ చరణ్ పై మోజుపడి పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ టాలీవుడ్ హీరోయిన్ ఎవరు అనే విషయాన్నికి వస్తే ఆమె మరెవరో కాదు నటి కాజల్ అగర్వాల్ అని తెలుస్తుంది.

కాజల్ అగర్వాల్ రామ్ చరణ్ మగధీర సినిమాలో కలిసే నటించారు ఈ సినిమా సమయంలోనే రామ్ చరణ్ పట్ల కాజల్ పాజిటివ్ ఒపీనియన్ ఏర్పరచుకోవడమే కాకుండా తనని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట అయితే అప్పటికే ఉపాసన రాంచరణ్ ప్రేమ విషయం తెలియడంతో ఈమె తప్పుకున్నారని అనంతరం తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ప్రస్తుతం ఈమెకు ఒక బాబు ఉన్నారు. ఇక పెళ్లి తర్వాత కూడా కాజల్ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.